ఆడవారికి ఈ విటమిన్లు చాలా అవసరం.. అప్పుడే ఎలాంటి రోగాలు రావు..

First Published Aug 15, 2022, 5:01 PM IST

మగవారు, ఆడవారిలో శారీరక సమస్యలు భిన్నంగా ఉంటాయి. అందుకే ఆడవారు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే కొన్ని రకాల విటమిన్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆడవారు ఆరోగ్యంగా, ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటారని  నిపుణులు చెబుతున్నారు. 
 

పురుషుల శరీరతత్వం, ఆడవారి శరీర తత్వం భిన్నంగా  ఉంటుంది. అందుకే పురుషులతో పోల్చితే ఆడవారు చాలా వీక్ గా ఉంటారు. అందుకే వీరు పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇంట్లో ఉండే ఆడవారు ఫుడ్ వేస్ట్ కాకూడదనే ఉద్దేశ్యంతో ఇంట్లో మిగిలిపోయిన ఆహారాలనే ఎక్కువగా తింటుంటారు. దీనివల్ల వారి శరీరానికి కావాల్సిన పోషకాల అందవు. దీంతో వారు తీవ్ర అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆడవారికి ఈ విటమిన్లు చాలా అవసరం అవుతాయి. దాంతో వీరు హెల్తీగా, ఫిట్ గా ఉంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

మహిళలకు అవసరమైన విటమిన్లు

విటమిన్ ఎ

ఆడవారికి 40 నుంచి 45 ఏండ్లు రాగానే ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు సోకుతుంటాయి. ఈ ఏజ్ లోనే వారికి రుతువిరతి స్టార్ట్ అవుతుంది. దీంతో వారి శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఇలాంటి సమయంలో విటమిన్ ఎ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ఈ విటమిన్ ఎ గుమ్మడి గింజల్లో, బచ్చలి కూర, క్యారెట్లు, బొప్పాయి లో ఎక్కువగా ఉంటుంది. 
 

విటమిన్ బి9

గర్భిణులకు విటమిన్ బి9 చాలా అవసరం. ఈ పోషకం ద్వారానే తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. ఈ పోషకం గర్బిణుల్లో లోపిస్తే పిల్లలు పుట్టతోనే ఎన్నో లోపాలతో పుడతారు. ఈ విటమిన్ బి9 బీన్స్, ఈస్ట్ లో ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తినాలి. 
 

విటమిన్ డి

విటమిన్ డి సూర్య రశ్మి ద్వారానే కాదు వివిధ కూరగాయలు, పండ్ల ద్వారా లభిస్తుంది.  ఇది ఎముకలు బలంగా ఉండేందుకు చాలా అవసరం. ఇది లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. కాల్షియం కూడా ఎముకల బలానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం 15 నుంచి 30 నిమిషాలు ఎండలో ఉండే మీ శరీరానికి కావాల్సిన విటమిన్ డి లభిస్తుంది. అలాగే కొవ్వు చేపలు, పాలు, గుడ్లు, పుట్టగొడుగుల్లో కూడా విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది.  

విటమిన్ ఇ

ఈ విటమిన్ ఆడవారికి చాలా అవసరం. ఎందుకంటే  ఇది జుట్టు, చర్మం, గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే చర్మంపై ముడతలను, మచ్చలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం బచ్చలికూర, వేరుశెనగ వెన్న, బాదం పప్పులను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలి. 

విటమిన్ కె

ఆడవారిలో విటమిన్ కె లోపం ఏర్పడితే పీరియడ్స్, డెలివరీ సమయంలో రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. అందుకే ఈ విటమిన్ లోపించకుండా చూసుకోవాలి. ఆకు కూరలు, సోయా బీన్ నూనెలో ఈ విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. 

click me!