Immunity Booster: కొవిడ్ సోకినా ఏం కాకూడదంటే ఈ చిట్కాలు పాటించాలి..

First Published Jan 28, 2022, 4:35 PM IST

Immunity Booster: ప్రస్తుతం కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉంది. దీని బారిన పడకుండా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు ఈ కష్టకాలంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి ఈ ఇమ్యూనిటీని పవర్ ను పెంచుకోవాలంటే ఏం చేయాలి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

Immunity Booster: కరోనా ఎఫెక్ట్ తో ఇమ్యూనిటీ ప్రధాన్యత రోజు రోజుకు పెరిగిపోతోంది. ఎందుకంటే ఈ కష్టకాలంలో కరోనా వైరస్ నే కాదు.. ఇంకెన్నీ రోగాలొచ్చినా వాటన్నింటి నుంచి మనల్ని సురక్షితంగా కాపాడే ఏకైక బ్రహ్మాస్త్రం రోగ నిరోధక శక్తి. ఒక్కటే. ఇదే మనల్ని ఎన్నో రకాల రోగాల నుంచి ఈజీగా బయటపడేయగలదు. అందులోనూ ఇంకెన్ని వైరస్ లు మనపై దాడి చేసినా.. మనల్ని మనం కాపాడుకోవాలంటే నిరోనిరోధక శక్తి ఎంతో అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దాంతో ప్రజలు కూడా ఇమ్యునిటీ పవర్ ను పెంపొందించుకునేందుకు ముందుకొస్తున్నారు. ఏయే ఆహార పదార్థాలను తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుందో వాటినే తీసుకుంటున్నారు. మరి ఇమ్యునిటీ పవర్ ను పెంచుకోవాలంటే మనం పెద్దగా కష్టపడిపోవక్కర్లేదు. దాని కోసం కాస్త సమయాన్ని కేటాయిస్తే చాలు. పైసా ఖర్చు లేకుండా నిరో నిరోధక శక్తిని పెంచుకున్నవాళ్లవుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నీరు: మానవ శరీరంలో 70 శాతం నీరే ఉంటుందని మనకందరికీ తెలిసిందే. అందుకే ప్రతి రోజూ మనం పది గ్లాసుల నీటిని తప్పకుండా తాగాల్సిందేనని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఈ నీరే మనకు ప్రాణాధారం. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా ఎటువంటి జబ్బులు దరిచేరకూడదన్నా మన శరీరానికి అవసరమయ్యే నీటిని తాగాలి. అంతేకాదు జీవక్రియలన్నీ సక్రమంగా జరగడానికి నీరు ఎంతో అవసరం. తిన్న ఆహర రసాలు శరీరానికి చేరాలన్నా నీళ్లు అవసరం. అందుకే దాహం వేసినప్పుడే తాగాలనుకోకూడదు. దాహంగా అనిపించకపోయినా తరచుగా నీళ్లను తాగుతూ ఉండాలి. ప్రతి రోజూ కనీసం రెండున్నర లీటర్ల నీటిని తాగినా ఆరోగ్యంగా ఉంటారు. 

alone

చాలా మంది ఆకలి వేసినప్పుడే తింటుంటారు. అంటే వీరు సమయాన్ని పట్టించుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటారు. దీనికి వివిధ కారణాలను చెబుతుంటారు. మరికొందరైతే పనిని వంకపెట్టుకుని మార్నింగ్ టిఫినో లేక భోజనం చేయడమో మానేస్తుంటారు. ఇలా చేయడం మంచి పద్దతి కాదు. మెదడు, శరీరం సరిగ్గా పనిచేయాలంటే ఖచ్చితంగా ఆహారం అవసరం. అందుకే ప్రతిరోజూ ఆహారంలో విషయంలో నెగ్లెట్ చేయకండి. అంతేకాదు ప్రతి రోజూ ఒకే సమయానికి తినే విధంగా చూసుకోండి. ఇలా చేయడం వల్ల జీవగడియారం కూడా సరిగ్గా పనిచేయగలుగుతుంది. 

ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారాన్నే తీసుకోకుండా మీ ఆహారంలో మార్పులు ఉండేలా చూసుకోండి. రకరకాల కూరగాయలు, పండ్లు మీ రోజు వారి ఆహారంలో ఉండాలి. ఇలాంటి ఆహారం తీసుకున్నప్పుడే శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు వంటివి పుష్కలంగా అందుతాయి. దాంతోనే మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
 

అలసిన శరీరానికి నిద్ర ఎంతో అవసరం. శరీరం  నిద్రలోనే మరమత్తు ప్రక్రియ మొదలు పెడుతుంది. కాగా నిద్రతో అలసట, నిస్సత్తువ, నీరసం వంటి సమస్యలు దూరమవుతాయి. సో ప్రతిరోజూ కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి. సకల రోగాలను దూరం చేయడంలో నిద్ర ఎంతో ఉపయోగపడుతుంది.     

click me!