జుట్టు ఒత్తుగా పెరగాలా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

First Published Oct 15, 2021, 6:01 PM IST

జుట్టు ఒత్తుగా అందంగా ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ ప్రస్తుతమున్న వాతావరణ కాలుష్యం (pollution's) ఆహారపు జీవన శైలిలో ఉన్న మార్పుల వల్ల జుట్టు సమస్యలు అందరినీ బాధిస్తున్నాయి. జుట్టుకు కావలసిన సరైన పోషక విలువలు, విటమిన్ లు (vitamin's) అందకపోవడం వలన జుట్టురాలడం, పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలు బాధిస్తాయి.

జుట్టు ఒత్తుగా అందంగా ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ ప్రస్తుతమున్న వాతావరణ కాలుష్యం (pollution's) ఆహారపు జీవన శైలిలో ఉన్న మార్పుల వల్ల జుట్టు సమస్యలు అందరినీ బాధిస్తున్నాయి. జుట్టుకు కావలసిన సరైన పోషక విలువలు, విటమిన్ లు (vitamin's) అందకపోవడం వలన జుట్టురాలడం, పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలు బాధిస్తాయి. కాబట్టి ఇటువంటి సమస్యల నుండి బయట పడటానికి కొన్ని పరిహారాలు తెలుసుకుందాం.. 

జుట్టు ఒత్తుగా పెరుగుటకు ఉల్లిపాయ (onion) మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయలో సల్ఫర్, అమ్మోనియా అధికంగా ఉంటుంది. ఉల్లిపాయ గుజ్జులో కొబ్బరి నూనె (coconut oil) కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పేస్ట్ ను తలకు బాగా రాసి మర్దన చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయాలి.

కరివేపాకు  జుట్టు రాలుటను తగ్గిస్తుంది. కరివేపాకులో (curry leaf) బీటా కెరోటిన్లు, ప్రోటీన్లు ఉంటాయి. ఒక గిన్నెలో కొబ్బరి నూనె తీసుకోని ఇందులో కొన్ని కరివేపాకులను వేసి నల్లగా అయ్యే వరకు వేడి చేయాలి. ఇలా వేడి చేసిన నూనెను (heat oil) వడగట్టాలి. ఈ నూనెతో వారానికి రెండు మూడుసార్లు తలకు మర్దన చేసుకుని 45 నిమిషాల తర్వాత గాఢతలేని షాంపూతో తలస్నానం చేయాలి. 

కలబంద (aloevera) జుట్టును ఒత్తుగా చేయుటకు బలంగా చేయుటకు కావలసిన పోషకాలను కలిగి ఉంటుంది. కలబంద గుజ్జును తలకు మర్దన చేసుకుని 20 నిమిషాల తర్వాత షాంపూతో (shampoo)  తలస్నానం చేయాలి. ఇలా చేయుట వలన జుట్టు బలంగా ఒత్తుగా ప్రకాశవంతంగా మారుతుంది.      
 

గుడ్లలో (eggs) ప్రోటీన్, సల్ఫర్, జింక్, ఐరన్, అయోడిన్ మరియు భాస్వరం వంటి పోషకాలు ఉంటాయి. దీని ద్వారా ఇచ్చే ప్రోటీన్ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. పచ్చి గుడ్డును తలకు రాసుకుని 20 నిమిషాల ఆరనివ్వాలి. తర్వాత షాంపూతో (shampoo) తలస్నానం చేయడం వల్ల ప్రకాశవంతంగా ఉంటుంది.

ముఖ్యంగా వారానికి రెండు మూడు సార్లు తలస్నానం (head bath) చేయాలి. గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. తడి జుట్టును దువ్వడం చేయరాదు. గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ధూమపానం (smoking)చేయరాదు. జుట్టు పెరుగుదలకు ప్రోటీన్లు విటమిన్లు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. సమయానికి నిద్రపోవాలి.

click me!