విశ్వక్‌ సేన్‌ ముందు ఓవర్‌ చేయబోయి దొరికిపోయిన యాంకర్‌ సుమ.. కొడుకు సినిమాలో బూతులు బయటపెట్టి ఝలక్‌

First Published May 6, 2024, 7:53 PM IST

యాంకర్‌ సుమ అంటే పంచ్‌లు, సెటైర్లకి మారుపేరు. తన షోకి వచ్చిన గెస్ట్ లను ఓ రేంజ్‌లో ఆడుకుంటుంది. అలాంటిది ఆమెనే ఆడుకుంటే. విశ్వక్‌ సేన్‌ మామూలు షాక్‌ ఇవ్వలే..
 

యాంకర్‌ సుమ మాటల ప్రవాహం. ఆమె ఈవెంట్‌ చేసిందంటే లడలడ వాగుతూనే ఉంటుంది. కానీ ఏం చెప్పినా ఫన్నీగా, ఆకట్టుకునేలా చెబుతుంది. అలరించేలా మాట్లాడుతుంది. అందరి చూపు తనవైపు తిప్పుకుంటుంది. ఈవెంట్‌ని రక్తికట్టించడంలో ఆమెకి ఆమెనే సాటి. టీవీ షో చేసినా అంతే తనదైన యాంకరింగ్‌తో అలరిస్తుంది. గెస్ట్ లతో తను చేసే కామెడీ నవ్వులు పూయించేలా ఉంటుంది. 
 

టీవీ షోలను రక్తికట్టించే యాంకర్లలో సుమ పేరు ముందు ఉంటుంది. తనదైన మాటకారీ తనంతో గెస్ట్ లను ఆడుకునే సుమకి ఝలక్ తగిలింది. ఆమెనే అంటే ఆమెని మించిన వాడు వచ్చాడు. ఆమెకి చుక్కలు చూపించాడు. అది ఎవరో కాదు మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌. ఆయన సినిమాలోని డైలాగ్‌లతో షాకిస్తే, ఆమె కొడుకు సినిమాలో డైలాగ్‌లు బయటపెట్టి ఝలక్‌ ఇచ్చాడు విశ్వక్‌ సేన్‌. దెబ్బకి దిమ్మతిరిగిపోయింది. మరి ఇంతకి ఏం జరిగిందంటే..
 

తాజాగా `సుమ అడ్డా` షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో విశ్వక్‌ సేన్‌ నటించిన `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` మూవీ టీమ్‌ సందడి చేసింది. విశ్వక్‌సేన్‌, దర్శకుడు కృష్ణచైతన్య, కమెడియన్లు పాల్గొని సందడి చేశారు. ఇందులో విశ్వక్‌ సేన్‌ ఇచ్చిన ఝలక్‌కి సుమకి మైండ్‌ బ్లాక్‌ కావడం విశేషం. 
 

షోలో ప్రారంభం నుంచి ఎండ్‌ వరకు సుమ పంచ్ లకు విశ్వక్‌ సేన్‌ కౌంటర్లు పడుతూనే ఉన్నాయి. ఆమె మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా పంచ్‌లు వేస్తూ హిలేరియస్‌గా ఆడుకున్నాడు విశ్వక్‌ సేన్‌. ఇక టీమ్‌ వచ్చాక.. వారిలో విశ్వక్‌ సేన్‌కి ముంజకాయ ఇచ్చిందిసుమ. అది చూశాక.. దీనికి ముందు మరో ఐటెమ్‌ వస్తుంది కదా అని కాస్త పద్ధతిగా మాట్లాడాడు విశ్వక్‌ సేన్‌. దీంతో రెచ్చిపోయిన సుమ.. విశ్వక్‌ సేన్‌ ఒరిజినల్‌ లాంగ్వేజ్‌ చూద్దాం అని చెప్పి.. ఆయన నటించిన `ఫలక్‌నూమా దాస్‌` చిత్రంలోని ఊరమాస్‌ డైలాగ్‌ వినిపించింది. 
 

ఇందులో విశ్వక్‌ సేన్‌ చివర్లో ఓ బూతు డైలాగ్‌ వాడుతారు. దీనికి బీప్‌ వేశారు. దీంతో మండిపోయిన విశ్వక్‌ సేన్‌.. వెంటనే సుమ కొడుకు రోషన్‌ నటించిన `బబుల్‌ గమ్‌` సినిమాలోని చివరి డైలాగ్‌ ఒకసారి వేయండి అమ్మా అని చెప్పడంతో సుమకి నోట మాట రాలేదు. మౌనంగా తలదించుకుంది. ఆ సినిమాలో చాలా బూతులు వాడాడు రోషన్‌. `ల.. కొ..క`, `మ.. డే` వంటి పదాలు వాడాడు రోషన్‌. చాలా బూతు పదాలను ఇందులో ఉపయోగించారు. 
 

అది అర్థమైన సుమ దెబ్బకి సైలెంట్‌ అయిపోయింది. ఆ తర్వాత సమయం చాలా విలువైనది అని సుమ అనగా, వెళ్లి యూజ్‌ చేసుకోనా అంటూ విశ్వక్‌ మరో పంచ్‌ వేశాడు. దెబ్బకి సుమ షాక్‌ అయ్యింది. నీకు ఈత వచ్చా మరి అని సుమ అడగ్గా.. నాకు ఈతొచ్చు.. తొమ్మిది రకాలుగా కొడతా అన్నాడు విశ్వక్‌. తొమ్మిది రకాలా.. ఏ ఒక్క రకం కొడితేసరిపోతుంది కదా అని అడగ్గా, నా ఇష్టం ఉన్నట్టు కొడతా అని చెప్పడం విశేషం. 
 

ఆ తర్వాత పక్కన ఉన్న కమెడియన్‌ పమ్మి సాయి గోదావరి ఈ చివరి నుంచి ఆ చివరికి కొట్టాడు అని చెప్పగా, ఏంటి గోదావరి ఈత కొట్టారా మీరు అని సుమ అమాయకంగా అడిగింది. దీంతో విశ్వక్‌ స్పందిస్తూ, నేను సముద్రం మధ్యలో కూడా బోట్‌ ఆపేసి సడెన్‌గా దూకేస్తా అని చెప్పడంతో నోరెళ్లబెట్టింది సుమ. మరి తర్వాత ఎవరు తీసుకొస్తారని అడగ్గా, నేనే వస్తా ఓ పదిహేను నిమిషాలు ఆగి అని విశ్వక్‌ సేన్‌ చెప్పడంతో ఆమెకి ఫ్యూజులు ఎగిరిపోయినంత పనైంది. 

దీంతోపాటు పమ్మి సాయి కామెడీ మరింతగా ఆకట్టుకుంది. నవ్వులు పూయించింది. అలాగే ఆయన `నారప్ప` స్టోరీ హిలేరియస్‌గా నవ్వించింది. అనంతరం సుమ డబ్బులిచ్చే సేట్‌గా, విశ్వక్‌ సేన్‌ అప్పు తీసుకునే వ్యక్తిగా వచ్చి కాసేపు స్కిట్‌ చేశారు. ఇందులోనూ సుమని ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు విశ్వక్‌ సేన్‌. ఆవు పాలు ఇస్తుందని, మా ఆవు డైరెక్ట్ పెరుగు ఇస్తుందంటే, మాది నెయ్యే వస్తుందని విశ్వక్‌ చెప్పడం, అసలు ఇవ్వను అంటే మిత్తి ఇవ్వనని తను రెచ్చిపోయి కౌంటర్లు వేసుకున్నారు. మొత్తంగా సుమకి మాత్రం షోలో చుక్కలు చూపించాడు విశ్వక్‌ సేన్‌. `సుమ అడ్డా` లేటెస్ట్ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంది. ఇది మే 11న ఈటీవీలో ప్రసారం కానుంది.  
 

click me!