జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాటల దాడి, వీడియో డిలీట్... అందులో ఏముంది?

Published : May 06, 2024, 09:21 PM IST

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ధాటికి రాకింగ్ రాకేష్ తన సోషల్ మీడియా పోస్ట్ డిలీట్ చేశారు. కామెంట్స్ తో రాకింగ్ రాకేష్ ని వాళ్ళు భయాందోళనకు గురి చేశారు. మరి రాకింగ్ రాకేష్ పోస్ట్ చేసిన ఆ వీడియోలో  ఏముంది?   

PREV
16
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాటల దాడి, వీడియో డిలీట్... అందులో ఏముంది?
Pawan Kalyan

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. తెలంగాణ కంటే ఏపీ ఎన్నికలు చాలా ప్రత్యేకం. అధికార వైఎస్ఆర్సీపీని ఢీ కొట్టేందుకు ఎన్డీఏ కూటమి బరిలో దిగింది. బీజేపీ+టీడీపీ+జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. ఇక పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 
 

26
Get up Srinu

పవన్ కళ్యాణ్ కి ఓటు వేయాలని జబర్దస్త్ కమెడియన్స్ పలువురు ప్రచారం చేస్తున్నారు. హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, రాకెట్ రాఘవతో పాటు మెగా ఫ్యామిలీ నుండి వైష్ణవ్ తేజ్, నాగబాబు, ఆయన సతీమణి పద్మజ, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ప్రచారం చేస్తున్నారు. 
 

36
Get up Srinu


అదే సమయంలో వైసీపీకి మద్దతుగా కొందరు టాలీవుడ్ సెలెబ్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. యాంకర్ శ్యామల వైసీపీలో చేరడంతో పాటు పిఠాపురం నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. వైసీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రచారం చేశారు. 
 

46
Rocking Rakesh

కాగా జబర్దస్త్ కమెడియన్స్ లో ఒకరైన రాకింగ్ రాకేష్ ఒకప్పటి జడ్జి రోజాకు మద్దతుగా నగరి నియోజకవర్గంలో పర్యటించాడు. ఈ క్రమంలో ఒక ముసలావిడతో ఆయన మాట్లాడాడు. నీ ఓటు ఎవరికి అని ఆ పెద్దావిడను అడిగాడు. ఆమె వైఎస్ జగన్ కి అనుకూలంగా మాట్లాడింది. 
 

56
Pawan Kalyan

ఇంటికి పెన్షన్, రేషన్ ఇస్తున్నాడు. వైఎస్ జగన్ కే నా ఓటు. మా ఓట్లు 15 ఉన్నాయి. అన్నీ వైసీపీ పార్టీకే వేస్తామని ఆ వృద్ధ మహిళ చెప్పింది.  ఈ వీడియోను రాకింగ్ రాకేష్ తన సోషల్ మీడియా అకౌంట్స్ పోస్ట్ చేశాడు. వైసీపీకి మద్దతు తెలిపిన రాకింగ్ రాకేష్ పై జనసైనికులు మాట దాడికి దిగారు.

66


పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న నీకు పరిశ్రమలో కెరీర్ లేకుండా చేస్తాం. నీకు భవిష్యత్ ఉండదంటూ కామెంట్స్ తో బెదిరింపులకు దిగారు. దాంతో రాకింగ్ రాకేష్ ఆ వీడియోను డిలీట్ చేశాడు. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. జనసేనకు అంత మంది జబర్దస్త్ కమెడియన్స్ ప్రచారం చేసినా తగలని నిరసన సెగ రాకింగ్ రాకేష్ కి తగిలింది.. 
 

Read more Photos on
click me!

Recommended Stories