Latest Videos

పాత న్యూస్ పేపర్లను దేనిదేనికి వాడొచ్చో తెలుసా?

First Published May 26, 2024, 10:33 AM IST

పాత పేపర్లు దేనికీ పనికి రావని చాలామంది ఆడవారు వీటిని అమ్ముతుంటారు. కానీ పాత న్యూస్ పేపర్లతో ఎన్నో ఇంటి పనులు చేయొచ్చు. అవును వీటిని ఉపయోగించి ఎన్నో వస్తువులను క్లీన్ చేయొచ్చు.
 

పొద్దున్నే టీ తో న్యూస్ పేపర్ ను చదివే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ రోజు చదివిన పేపర్ ను మళ్లీ ఓపెన్ చేయరు. అందుకే పాత న్యూస్ పేపర్లన్నింటినీ ఇంట్లో ఓ మూలన పెడుతుంటారు. ఎందుకంటే వీటితో పెద్దగా పని ఉండదు. అయితే పాత వార్తా పత్రికలు కూడా మీకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ ఓల్డ్ న్యూస్ పేపర్లతో ఇంటిని క్లీన్ చేయొచ్చు. ఈ పేపర్లను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

వార్తాపత్రికలను ఎలా ఉపయోగించాలి? 

వార్తా పత్రికను చదివిన తర్వాత వీటిని అమ్ముతుంటారు. ఎందుకంటే ఇవి మనకు ఏ రకంగానూ ఉపయోగపడవని. కానీ చాలా పనులను సులభతరం చేయడానికి మీరు ఈ న్యూస్ పేపర్లను ఎన్నో ఇతర మార్గాల్లో ఉపయోగించొచ్చు.
 

గ్లాసును శుభ్రం చేయడానికి.. 

కిటికీ అద్దాలకు దుమ్ము, ధూళి ఎక్కువగా పడుతుంటాయి. దీనివల్ల ఇవి చాలా తొందరగా మురికిగా కనిపిస్తాయి. అయితే వీటిని మీ ఇంట్లో ఉంచిన పాత వార్తాపత్రిక సహాయంతో కొత్త వాటిలా మెరిసేలా చేయొచ్చు. అవును అద్దంపై కొన్ని చుక్కల నీళ్లు చల్లి  వార్తాపత్రికతో శుభ్రం చేస్తే అద్దానికి ఉన్న దుమ్ము, ధూళి వదిలిపోతాయి. 
 

టైల్ ని శుభ్రం చేయడానికి.. 

పాత వార్తాపత్రికను టైల్స్ ను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం పాత న్యూస్ పేపర్ ను వెనిగర్, నీటి ద్రావణంలో నానబెట్టండి. దీని సహాయంతో టైల్స్ శుభ్రం చేయండి. ఇది టైల్స్ పై పడిన మరకలను శుభ్రపరుస్తుంది. దీంతో టైల్స్ తలతల మెరిసిపోతాయి.

అల్మారాలో ఉంచండి. 

పాత న్యూస్ పేపర్లను అల్మారాకు కూడా ఉపయోగించొచ్చు. అల్మారాలో పాత వార్తాపత్రికలను నీట్ గా పరిచి వాటిపై బట్టలను పెట్టండి. దీనివల్ల బట్టలు మురికిగా మారవు. అలాగే దుమ్ము పేరుకుపోకుండా ఉంటుంది. 
 

Fridge Clean

ఫ్రిజ్ వాసన పోగొట్టడానికి.. 

ఫ్రిజ్ వాసనను పోగొట్టడానికి కూడా మీరు పాత న్యూస్ పేపర్లను ఉపయోగించొచ్చు. కొన్ని రోజుల తర్వాత ఫ్రిజ్ లో నుంచి దుర్వాసన రావడం మొదలవుతుంది. ఈ వాసన అంత తొందరగా పోదు. కానీ దీన్ని న్యూస్ పేపర్ తో క్లీన్ చేస్తే వాసన తొందరగా పోతుంది. ఫ్రిజ్ వాసనను పోగొట్టడానికి వార్తాపత్రికను నీటిలో నానబెట్టి దీన్ని ఒక బంతిలా తయారుచేయండి. దీన్ని కాసేపు ఫ్రిజ్ లో ఉంచండి. ఇలా చేయడం వల్ల వాసన పోతుంది.

పండ్ల కింద.. 

పాత వార్తాపత్రికను పండ్ల కింద కూడా వేయొచ్చు. ఇలా చేయడం వల్ల పండ్లు త్వరగా పాడవవు. న్యూస్ పేపర్ల వల్ల పండ్లు కింది నుంచి తాజాగా ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. 

click me!