కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇలా చేస్తే సరిపోతుంది కదా

First Published Dec 15, 2023, 1:28 PM IST

ఉప్పు లేని కూరలను తినడం కష్టమే. ఎందుకంటే ఉప్పుతోనే ఫుడ్ టేస్టీగా మారుతుంది. అయితే కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా ఉప్పును ఎక్కువగా వేస్తుంటాం. ఉప్పు తక్కువున్నా తినొచ్చు. కానీ ఉప్పు ఎక్కువైన ఆహారాలను తినడం మాత్రం కష్టమే. ఇలాంటి కూరలను డైరెక్ట్ డస్ట్ బిన్ లోనే వేస్తుంటారు. కానీ కొన్ని చిట్కాలతో కూరలో ఉప్పును తగ్గించుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం పదండి. 
 

Excess Salt

సాధారణంగా మన వంటలకు టేస్ట్ ను ఇచ్చేది ఉప్పే. ఉప్పు లేకుండా అస్సలు వంటలను తింటారా చెప్పండి. కష్టమే కదా. కానీ ఉప్పు మరీ ఎక్కువగా ఉన్న కూరలను, ఇతర ఆహారాలను తినడం కూడా కష్టమే. ఉప్పు ఎక్కువైన కూరలు తినడానికి అస్సలు పనికి రావు. కావాలని ఎవ్వరూ కూరలో ఉప్పు ఎక్కువగా వేయరు. కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా కూరల్లో ఉప్పు ఎక్కువగా పడుతుంది. ఇలాంటి కూరలు వేస్ట్ కాకుండదంటే ఏం చేయాలి? దాంట్లో ఉప్పును ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

వాటర్

కూర లేదా ఇతర ఆహారాల్లో ఉప్పు కాస్త ఎక్కువైంది అన్నట్టు అనిపిస్తే ఈ చిట్కాను ఫాలో అవ్వండి. దీనికోసం మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. సాంబారు, రసం, పప్పు వంటి కూరల్లో ఉప్పు మరీ ఎక్కువైతే కొద్దిగా నీళ్లు పోసి మరిగిస్తే సరి. ఉప్పు ఎక్కువగా వేశారు అన్న మాటే రాదు. 
 

Latest Videos


టమాటాలు

రసం లేదా గ్రేవీలో వంటి ఆహారాల్లో ఉప్పు ఒక్కోసారి ఎక్కువ అవుతుంటుంది. అయితే వీటిలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించడానికి మీకు టమాటాలు బాగా ఉపయోగపడతాయి. అవును ఈ వంటల్లో ఒకటి లేదా రెండు బాగా మెత్తగా లేదా గ్రైండ్ చేసి ఉడఉడకబెట్టి వేయాలి. దీంతో ఉప్పు పరిమాణం తగ్గుతుంది.
 

potatoes

బంగాళాదుంపలు

గ్రేవీ, పప్పు, సాంబార్ లేదా సూప్ లో ఉప్పు ఎక్కువగా ఉంటే బంగాళాదుంపలను ఉపయోగించండి. అంటే చిన్నగా కట్ చేసి లేదా గ్రైండ్ చేసి ఉడికించిన బంగాళాదుంపలు కలుపుకోవచ్చు. బంగాళాదుంపలు ఉప్పును తగ్గిస్తాయి. ఇంకొక చిట్కా ఏంటంటే.. బంగాళాదుంపలను వృత్తాకార ఆకారంలో కట్ చేసి పప్పులో వేసి 5 నిమిషాలు ఉడకబెట్టాలి. ఇవి ఉప్పును గ్రహిస్తాయి. వడ్డించే ముందు ఆ బంగాళాదుంపలను బయటకు తీసేస్తే సరి. 
 


కొబ్బరి పాలు

కొబ్బరి పాలతో కూడా కూరలో ఎక్కువైన ఉప్పును తగ్గించుకోవచ్చు. మీరు చేసిన కూరలో ఉప్పు మరీ ఎక్కువగా ఉంటే దాంట్లో కొబ్బరి పాలను కలపండి. ఈ కొబ్బరి పాలు మీ కూరను మరింత టేస్టీగా చేస్తాయి.  అంతేకాదు ఈ పాల ద్వారా మీకు పోషకాలు కూడా అందుతాయి. 

Image: Getty


పిండి 

బియ్యంప్పిండి, మైదా, శనగపిండి, గోధుమపిండిలో ఏదో ఒక పిండితో కూడా ఎక్కువైన ఉప్పును తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో వేసి అర గ్లాసు నీళ్లు పోసి ముద్దలు లేకుండా పిండిని కలిపి ఉప్పు ఎక్కువగా ఉండే  చారులో వేసి మరిగించండి. ఉప్పు తగ్గుతుంది.
 

curd

పెరుగు

పెరుగుతో కూడా ఎక్కువైన ఉప్పును తగ్గించుకోవచ్చు. ఇందుకోసం పెరుగును ముద్దలు లేకుండా చేసి గ్రేవీలో పోసి కలపండి. తర్వాత మీడియం మంట మీద బాగా మరిగిస్తే ఉప్పు తగ్గుతుంది. ఇకపై ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉంటే కంగారు పడకుండా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి. 

click me!