సిటీల్లో సౌకర్యాలకు ఎలాంటి కొదవ ఉండదు. కానీ చిన్న స్థలంలో ఉండటం మాత్రం సవాలుతో కూడుకున్నదే. ఎందుకంటే ఒక చిన్న ఇంట్లో ఉండటం చాలా కష్టమే. ముఖ్యంగా రూమంతా సామాన్లతో నిండి ఉంటే మరింత గందరగోళంగా, చిరాగ్గా అనిపిస్తుంది. దీనివల్ల మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉండలేరు. అయితే కొన్ని స్టార్ట్ ట్రిక్స్ తో మీరు ఉంటున్న చిన్న గది పెద్దగా కనిపించేలా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Image: Getty
గోడ రంగులు
మీ గోడలపై ఉన్న రంగులు కూడా రూం చిన్నగా లేదా పెద్దగా కనిపించడంలో ప్రభావం చూపుతుంది. ముదురు రంగులను గోడలకు వేయడం వల్ల కాంతి ప్రతిబింబం మరింత తగ్గుతుంది. దీంతో రూం చాలా చిన్నగా కనిపిస్తుంది. అదే మీరు తేలికపాటి రంగులను గోడలకు వేయడం వల్ల మీ గది పెద్దగా కనిపిస్తుంది. అలాగే గోడలపై బోల్డ్ చారలకు పెయింటింగ్ వేయడం వల్ల వాటి పరిమాణాన్ని విజువల్ గా పెంచుకోవచ్చు.
గదుల్లో మనం ఎక్కువగా ఫ్లోర్ ప్లేస్ నే ఎక్కువగా ఉపయోగిస్తాం. కానీ గోడలను మాత్రం ఉపయోగించుకోం. కానీ తెలివిగా మీరు గోడలను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం మీరు మీ గోడలపై తేలియాడే అల్మారాలను ఏర్పాటు చేయొచ్చు లేదా సీలింగ్-ఎత్తైన అల్మారాలను నిర్మించొచ్చు. మీరు గోడలకు లేదా ఫర్నిచర్ ఉపరితలంపై హుక్ లను కూడా జోడించవచ్చు. ఇది మీ ఇల్లు చిన్నగా కనిపించకుండా చేస్తుంది.
ఫర్నిచర్
మీ గదిలో పెట్టిన ఫర్నీచర్ కూడా మీ గది చిన్నగా కనిపించేలా కూడా చేస్తుంది. మీ గదిలో కాళ్లతో షెల్ఫ్ లను నిర్మించడానికి బదులుగా ఫ్లోటింగ్ షెల్ఫ్ లను ఏర్పాటు చేయొచ్చు. అలాగే అవసరమైనప్పుడు తెరవడానికి మీరు మర్ఫీ బెడ్ లేదా ఇతర ఫోల్డబుల్ ఫర్నిచర్ ను కొనొచ్చు.
అద్దాలను ఉపయోగించండి
మీ గది పెద్దగా కనిపించడానికి, ఇంట్లో స్థలాన్ని పెంచడానికి అద్దాలు బాగా సహాయపడతాయి. మీ గదిలో మిర్రర్ ను పెట్టడం వల్ల రూం పెద్దదిగా కనిపిస్తుంది. ఇది మీ గదిని ప్రతిబింబించి మీకు ఒక భ్రమను కలిగిస్తుంది. అలాగే రూం సైజు డబుల్ గా కనిపిస్తుంది. ఇందుకోసం మీరు పెద్ద అద్దాలను ఉపయోగించండి.
డెకరేషన్
మీరు ఎన్నో రకాల ఇంటి డెకరేషన్ వస్తువులను ఉపయోగించి గదిని అలంకరించడం వల్ల మీ రూంను అందంగా మార్చుకోవచ్చు. అయితే దీన్ని తక్కువ స్థలంలో తక్కువగా ఉండేలా చూసుకోండి. తక్కువ డెకరేషన్ ఇంటిని పెద్దగా కనిపించేలా చేస్తుంది. కానీ ఎక్కువ డెకరేషన్ గందరగోళంగా కనిపిస్తుంది.