ఎన్టీఆర్‌ సినిమాతో పరిచయం కావాల్సిన కృష్ణంరాజుకి ఆఫర్‌ ఎలా మిస్‌ అయ్యింది? సిగరేట్ ఎంత దెబ్బకొట్టింది?

Published : Jan 21, 2025, 09:50 PM IST

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు `చిలకా గోరింక` మూవీతో వెండితెరకు పరిచయం అయ్యారు, కానీ ఆయన ఎన్టీఆర్‌ సినిమాతో మైథలాజికల్‌ మూవీతో హీరోగా పరిచయం కావాల్సి ఉండేనట. మరి ఎలా మిస్‌ అయ్యింది.   

PREV
16
ఎన్టీఆర్‌ సినిమాతో పరిచయం కావాల్సిన కృష్ణంరాజుకి ఆఫర్‌ ఎలా మిస్‌ అయ్యింది? సిగరేట్ ఎంత దెబ్బకొట్టింది?

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు.. రాజుల ఫ్యామిలీ నుంచి వచ్చారు. తన తాతలు అంతా రాజులఫ్యామిలీ. కానీ నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. నటుడిగా ఎంట్రీ ఇచ్చి రెబల్‌ స్టార్‌గా ఎదిగారు. టాలీవుడ్‌లో టాప్‌ స్టార్స్ లో ఒకరిగా రాణించారు. తిరుగులేని రెబల్‌ స్టార్‌గా పాపులారిటీని, ఇమేజ్‌ ని, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకున్నారు. 
 

26

కృష్ణంరాజు 1966లో `చిలకా గోరింక` చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఇందులో తనే హీరో. మొదటి సినిమాలోనే హీరోగా నటించడం విశేషం. తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నారు రెబల్‌ స్టార్‌. ఇందులో రాజా పాత్రలో అదరగొట్టారు కృష్ణంరాజు.

ఇదిలా ఉంటే ఈ మూవీ కంటే ముందే కృష్ణంరాజు నటుడిగా వెండితెరకు పరిచయం కావాల్సింది. ఎన్టీఆర్‌ సినిమాతో పరిచయం కావాల్సింది. కానీ మిస్‌ అయ్యింది. మరి ఇంతకి ఆ సినిమా ఏంటి? ఎలా ఆఫర్‌ మిస్‌ అయ్యిందనేది చూస్తే. 
 

36

దిగ్గజ దర్శకుడు వీ మధుసూధన రావు అప్పట్లో ఎన్టీఆర్‌ హీరోగా `వీరాభిమాన్యు` అనే చిత్రాన్ని రూపొందించారు. ఇందులో కృష్ణుడి పాత్రని ఎన్టీఆర్‌ పోషించారు. కానీ మరో కీలకపాత్ర అయిన అభిమాన్యు పాత్రకి ఓ కొత్త కుర్రాడిని తీసుకోవాలనుకున్నారు.

అందుకోసం ఆడిషన్‌ నిర్వహిస్తే కృష్ణంరాజు బాగున్నాడు, బాగా సెట్‌ అవుతాడని భావించారు. ఆయన్ని ఓ సారి వచ్చి దర్శకుడు మధుసూధన రావుని కలవాలని చెప్పారు. ఆయన ఆఫీస్‌కి వెళ్లాడు కృష్ణంరాజు. దర్శకుడు రావడానికి టైమ్‌ పట్టింది. దీంతో తన వద్దన 555 సిగరేట్‌ ప్యాకెట్‌ తీసి సిగరేట్‌ కాల్చాడు. 
 

46

చాలా సేపు వెయిట్‌ చేసినా ఆయన రాలేదు. దీంతో ఆ సిగరేట్‌ ప్యాకెట్‌ని అలానే టేబుల్‌పై పెట్టి కాసేపు అలా బయటకు వెళ్లాడు కృష్ణంరాజు. అప్పుడే దర్శకుడు మధుసూధనరావు వచ్చారు. టేబుల్‌పై సిగరేట్‌ ప్యాకెట్‌ చూశాడు.

ఆ అబ్బాయిని పిలవాలని చెప్పగా, ఆఫీస్‌ బాయ్స్ పిలుచుకు వచ్చారు. కృష్ణంరాజు వచ్చీ రావడంతోనే టేబుల్‌ పై సిగరేట్‌ ప్యాకెట్‌ నీదేనా అని అడిగితే, నాదే సార్‌ అన్నాడట కృష్ణంరాజు. అంతే ఇక నువ్వు వెళ్లిపోవచ్చు అని చెప్పాడట దర్శకుడు. 
 

56

అంత సేపు వెయిట్‌ చేస్తే ఏం మాట్లాడకుండా, ఆడిషన్‌ చేయకుండా పంపించేస్తున్నారేంటి? అని కృష్ణంరాజు అడిగితే, తనకు సిగరేట్‌ తాగేవాళ్లు అంటే నచ్చదు, తనముందు సిగరేట్‌ తాగుతుంటే తాను భరించలేను, నా కోసం మీరు సిగరేట అలవాటు మానుకోవడం నాకు ఇష్టం లేదు,అది మీకు ఇబ్బంది, అందుకే ఈ ఆఫర్‌ ఇవ్వలేను అని చెప్పాడట.

ఆ ఒక్క కారణంతోనే కృష్ణంరాజుని రిజెక్ట్ చేశారు. అలా `వీరభిమాన్యు`లో అభిమాన్యు పాత్రతో వెండితెరకు పరిచయం కావాల్సిన కృష్ణంరాజు మంచి ఆఫర్‌ని మిస్‌ చేసుకున్నారు. ఆ పాత్రలో శోభన్‌ బాబుని ఎంపిక చేశారు. ఆ మూవీతో శోభన్‌బాబు బాగా పాపులర్‌ అయ్యారు. 
 

66

ఈ సినిమా ఆఫర్‌ మిస్‌ కావడంతో దాదాపు రెండేళ్లు అవకాశాలు కోసం తిరిగాడట కృష్ణంరాజు. అనంతరం `చిలకా గోరింక` చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత రెబల్‌ స్టార్‌ సృష్టించిన సంచలనాలు ఎలాంటివో అందరికి తెలిసిందే. ఇక కృష్ణంరాజు రెండేళ్ల క్రితం కన్నుమూశారు. ఆయన వారసత్వాన్ని ప్రభాస్‌ కొనసాగిస్తున్నారు. 

read more:వెంకటేష్‌ సరికొత్త రికార్డు, `సంక్రాంతికి వస్తున్నాం` కలెక్షన్ల సునామీ.. చిరు, బన్నీ రికార్డులకు ఎసరు!

also read: రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు సినిమా నుంచి గూస్‌ బంమ్స్ అప్‌డేట్‌.. RC16 స్టోరీలో కీలక పాయింట్‌ లీక్‌?

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories