రియల్‌మీ 14 ప్రో vs పోకో X7: ఏది బెస్ట్ ఫోనో తెలుసా?

Published : Jan 21, 2025, 09:58 PM IST

ప్రస్తుతం మార్కెట్లో రియల్ మీ, పోకో కంపెనీల ఫోన్లు పోటీపడుతున్నాయి. లేటెస్ట్ మోడల్స్ తో ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన రియల్‌మీ 14 ప్రో, పోకో X7 ఈ రెండింటి మధ్య పోలికలు, ప్రత్యేకతలు ఇప్పుడు పరిశీలిద్దాం. కెమెరా, డిస్‌ప్లే, పనితీరులో ఏది బెటర్ ఫోనో తెలుసుకుందాం. 

PREV
15
రియల్‌మీ 14 ప్రో vs పోకో X7: ఏది బెస్ట్ ఫోనో తెలుసా?

రియల్ మీ కంపెనీ OPPO ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ తో కలిసి ఉండేది. రియల్ మీ తన మొట్టమొదటి ఫోన్ ను చైనాలో 2010 లో OPPO రియల్ పేరుతో విడుదల చేసింది. 2018 లో OPPO ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ తో విడిపోయి స్వతంత్ర సంస్థగా మారింది.

Poco బ్రాండ్ ఆగస్ట్ 2018లో Xiaomi సబ్ బ్రాండ్‌గా ప్రారంభమైంది. Xiaomi Poco బ్రాండింగ్ కింద Pocophone F1ని ప్రవేశపెట్టింది. అది విజయవంతమైంది. జనవరి 2020లో Poco India స్వతంత్ర బ్రాండ్‌గా మారింది. 3 సంవత్సరాల వ్యవధిలో 11 పరికరాలను ప్రారంభించింది.

 

25

రియల్‌మీ 14 ప్రో, పోకో X7 ఫోన్లు

రూ.25,000 లోపు కొత్త ఫోన్ కోసం చూస్తున్న వారికి రియల్‌మీ 14 ప్రో, పోకో X7 ఫోన్లు మంచి ఆప్షన్. భారత్‌లో లాంచ్ అయిన ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీలను పోల్చి చూద్దాం.

డిస్‌ప్లే, డిజైన్

రియల్‌మీ 14 ప్రో కలర్ మారే స్వభావం కలిగిన బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. IP69, IP68, IP69 రేటింగ్‌తో దృఢంగా ఉంటుంది. పోకో X7 ప్లాస్టిక్ బ్యాక్, స్క్వేర్ కెమెరాతో వస్తుంది. రూ.4,000 తక్కువ ధరకే IP66 + IP68 + IP69 రేటింగ్ ఉంది. రియల్‌మీ 14 ప్రో 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. పోకో X7 6.67 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే, 3000 నిట్స్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

35

కెమెరా ఫీచర్స్

రియల్‌మీ 14 ప్రో డ్యూయల్ కెమెరాతో వస్తుంది. దీనిలో 50MP OIS ప్రైమరీ కెమెరా (సోనీ IMX882 సెన్సార్), డెప్త్ సెన్సార్ ఉన్నాయి. పోకో X7లో 50MP ప్రైమరీ కెమెరా (సోనీ LYT-600 సెన్సార్), 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం రియల్‌మీ 14 ప్రోలో 16MP కెమెరా, పోకో X7లో 20MP కెమెరా ఉన్నాయి.

45

బ్యాటరీ

రియల్‌మీ 14 ప్రో 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జర్ ని కలిగి ఉంది. పోకో X7 5500 mAh బ్యాటరీ (45W ఫాస్ట్ ఛార్జింగ్) తో వస్తున్నాయి. పోకో X7తో పోలిస్తే రియల్‌మీ బ్యాటరీ ఎక్కువసేపు ఉంటుంది.

55
రియల్‌మీ 14 ప్రో, పోకో X7 ధర

ధర

ధర విషయానికొస్తే రియల్‌మీ 14 ప్రో 128 GB/8 GB కెపాసిటీ ఉన్న ఫోన్ ధర రూ.24,999. పోకో X7 128 GB/8 GB కెపాసిటీ ఉన్న ఫోన్ ధర రూ.21,999. పోకో X7 కంటే రియల్‌మీ 14 ప్రో కాస్త ఖరీదు. ఈ రెండు ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఆఫర్లు ఉన్నాయి.

click me!

Recommended Stories