ఈ ఒక్క ఆకుతో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అన్నీ కంట్రోల్ అవుతాయి

By Shivaleela Rajamoni  |  First Published Jan 6, 2025, 2:10 PM IST

కరివేపాకులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ ఆకును ఉపయోగించి మనం ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అసలు కరివేపాకు ఏయే సమస్యలను తగ్గిస్తుందో తెలుసా?


ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు.. చాలా మంది షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ వంటి జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్నారు. అయితే ఈ వ్యాధులను నియంత్రించడానికి  ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది తెలుసా? ముఖ్యంగా కరివేపాకు. అవును కరివేపాకును మన ఆహారంలో చేర్చడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటాం. కరివేపాకులో విటమిన్ కె, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, రాగి, ఇనుము, కాల్షియం, భాస్వరం, జింక్, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

Latest Videos

ముఖ్యంగా కరివేపాకులో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. దీన్ని మన రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంటే డయాబెటీస్ పేషెంట్లకు కరివేపాకు చాలా మంచిది. దీన్ని గనుక షుగర్ పేషెంట్లు తమ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటాయి. షుగర్ పెరిగింది అనే సమస్యే ఉండదు. ఇందుకోసం వీళ్లు ఉదయాన్నే పరిగడుపున కరివేపాకును నమిలి తినాలి. మీకు తెలుసా? కరివేపాకు శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. మన గుండె ఆరోగ్యం బాగుంటుంది. 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కరివేపాకును మన రోజువారి ఆహారంలో చేర్చడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ముఖ్యంగా మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. కరివేపాకులో బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులను తింటే మన జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు రాలిపోయే, తెల్లగా అయ్యే అవకాశాలు తగ్గుతాయి. కరివేపాకు చిన్న వయసులో తెల్ల జుట్టు రాకుండా వెంట్రుకలను నల్లగా ఉంచేందుకు సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండే కరివేపాకును రోజూ తింటే మన ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. దీంతో మనం ఎన్నో రోగాలకు దూరంగా ఉంటాం. 

కరివేపాకులో విటమిన్ ఎ మెండుగా ఉంటాయి. అంటే దీన్ని ప్రతిరోజూ తినడం వల్ల మన కంటి చూపు మెరుగుపడుతుంది. కంటికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటే కరివేపాకు చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఇది చర్మ సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీరు బరువు తగ్గడాలనుకుంటే కూడా ప్రతిరోజూ కరివేపాకును తినండి. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

గమనిక: ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా మేరకు మాత్రమే మీ ఆహారంలో మార్పులు చేసుకోండి.

ఇంకా చదవండి: రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో కార్పెట్ ను ఇలా శుభ్రం చేయండి

click me!