pigeons
సిటీల్లో పావురాలతో విసిగిపోయేవారు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా ఇవి బాల్కనీలో, ఇంటి పై కప్పుపై తిష్టవేసి మొత్తం మురికిగా మారుస్తాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. పావురాల రాకతో ఇళ్లు మొత్తం దుమ్ము దుమ్ము అవుతుంది. అలాగే అవి బాల్కనీ నుంచి ఇంట్లోకి వస్తాయి. పావురాల ఈకలు నుంచి ధూళిని వ్యాపింపజేస్తాయి. ఇంటిని , బాల్కనీని ఎంత శుభ్రం చేసినా ప్రతిరోజూ పావురాలు మురికిగా చేస్తూనే ఉంటాయి. అయితే కొన్ని మొక్కలతో ఇంటి చుట్టుపక్కలకు పావురాలు రాకుండా చేయొచ్చు.
పావురాలు రాకుండా చేసే మొక్కలు
కాక్టస్ మొక్క
ఇంట్లో కాక్టస్ మొక్కను నాటడం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. దీనివల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. ఈ మొక్క పావురాలను ఆ చుట్టుపక్కల లేకుండా చేస్తుంది. అవును పావురాలకు కాక్టస్ మొక్క ముళ్లు అస్సలు నచ్చవు. అందుకే ఈ మొక్క నుంచి దూరంగా పారిపోతాయి.
డాఫోడిల్ లేదా నర్గీస్ మొక్క
డాఫోడిల్ లేదా నర్గీస్ అని పిలువబడే ఈ మొక్క పువ్వు వాసన చాలా బాగుంటుంది. దీని వాసన చాలా ఘాటుగా ఉంటుంది. ఇది చి చిన్న చిన్న కీటకాలు, దోమలను దూరంగా ఉంచుతుంది. అలాగే పావురాలను కూడా దానిచుట్టు పక్కల లేకుండా చేస్తుంది.
Garlic
వెల్లుల్లి మొక్క
ఎన్ని చేసినా మీ ఇంటికి, బాల్కనీలోకి పావురాలు వస్తున్నట్టైతే పావురం వచ్చే వెళ్లే చోట ఒక వెల్లుల్లి మొక్కను ఉంచండి. ఎందుకంటే పావురాలు వెల్లుల్లి మొక్క నుంచి వచ్చే వాసనను ఇష్టపడవు. అవి దాని చుట్టూ తిరగవు. అంతేకాకుండా మీరు వెల్లుల్లిని వంటలకు కూడా ఉపయోగించొచ్చు.
సిట్రోనెల్లా
సిట్రోనెల్లా మొక్కను ధూపం కర్రల తయారీకి ఉపయోగిస్తారు. ఈ మొక్క నుంచి దోమల నివారిణి ధూపం కర్రలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ మొక్క వాసనకు ఆ చుట్టు పక్కలకు ఒక్క కీటకం కూడా రాదు. ఒక్క కీటకాలే కాకుండా పావురాలు కూడా మీ ఇంటికి దూరంగా ఉంటాయి.
పుదీనా మొక్క
పుదీనా వాసన ఎంత బలమైన వాసన వస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే దీన్ని మనం చాలా వంటల్లో వేస్తుంటాం. కానీ పుదీనా వాసన మాత్రం పావురాలకు అస్సలు నచ్చదు. మీ ఇంటి బాల్కనీలో పుదీనా మొక్కను నాటితే మీ ఇంట్లోకి పావురాల రాక చాలా వరకు తగ్గుతుంది.