కారు ఎటైనా వెళ్లడానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ కారులో అప్పుడప్పుడు దుర్వాసన వస్తుంటుంది. దీనివల్ల కారులో కూర్చోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే చాలా మందికి ఈ వాసనను ఎలా పోగొట్టాలో తెలియదు. కారులో వాసన రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒకటి కారులో క్లీన్ చేయని భాగాలు ఎన్నో ఉంటాయి. అలాగే కారులో తిన్న ఫుడ్ కూడా ఇందుకు కారణమవుతుంది. అయితే కారులో దుర్వాసనను మీరు కొన్ని సింపుల్ టిప్స్ తో పొగొటొచ్చు. ఎలాగంటే?
బొగ్గు
బొగ్గుతో దుర్వాసన పోవడమేంటని చాలా మందికి అనిపించొచ్చు. కానీ బొగ్గు కారులో దుర్వాసనను పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీ కారులో వాసన రాకుండా ఉండటానికి కొన్ని బొగ్గు ముక్కలను తీసుకొని వాటిని శ్వాసించదగిన సంచిలో వేయండి. దీనిని మీ కారులో పౌచ్ ఉంచండి. అలాగే రాత్రంతా లేదా కొన్ని రోజుల పాటు వాటిని కారులోనే ఉండనివ్వండి. బొగ్గు కారులోని చెడు వాసనను గ్రహిస్తుంది. అలాగే కారును తాజాగా, శుభ్రంగా ఉంచుతుంది.
ఒలికిపోయిన, మరకలు
కారులో వాసన రావడానికి అత్యంత సాధారణ కారణాల్లో కారులో ఫుడ్ పదార్థాలు ఒలికిపోవడం, మరకలు కావడం ఒకటి. చాలా మటుకు వీటిని ఎవరూ గమనించరు.కారులో తినడం లేదా తాగడం, ఏదైనా ఒలికిపోయినట్టైతే వాటిని వెంటనే తడి గుడ్డతో శుభ్రం చేయండి. స్పిల్ ను శుభ్రం చేయడం మర్చిపోవడం వల్ల ఒలికిపోయిన మరక పొడిగా మారి వాటిని పోగొట్టడం కష్టంగా మారుతుంది. అలాగే ఇది చెడు వాసనకు కారణమవుతుంది. అందుకే ఒలికిపోయిన ఫుడ్ ను తుడవడానికి మీ కారులో ఎప్పుడూ ఒక గుడ్డ ముక్కను పెట్టుకోండి.
ఎయిర్ అవుట్
మీ కారులో వాసన రాకూడదంటే మీరు చేయాల్సిన సింపుల్ పని మీ కారులోని వాసన బయటకు పోవడానికి అన్ని డోర్స్ ను తెరిచిపెట్టండి. కారు అనేది అండాకారంలో ఉండే బాక్స్. ఇది ఎప్పుడూ అన్ని వైపుల నుంచి మూసివేయబడుతుంది. ముఖ్యంగా దీన్ని ఎప్పుడూ ఉపయోగిస్తుంటే శరీర దుర్వాసన, గ్యాసోలిన్ వాసన, సహజ వాసనలు అన్నీ కలిసి దుర్వాసనను కలిగిస్తాయి. అందుకే మీ కారు తాజా వాసనను కలిగి ఉండటానికి వారానికి ఒకసారి ఒకటి లేదా రెండు సార్లు కారు డోర్లు అన్నీ తెరిచిపెట్టండి.
బేకింగ్ సోడా
కుకీలు, కేకులతో పాటు చెడు వాసన లేకుండా చేయడానికి బేకింగ్ సోడా చాలా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీ కారు సీట్లన్నింటిపై ఒక స్పూన్ బేకింగ్ సోడా చల్లి రాత్రంతా అలాగే ఉంచండి. వాక్యూమ్ తీసుకొని మరుసటి రోజు మీ కారును శుభ్రం చేయండి.