ఇప్పటికే ఇటీవల కాలంలో లాంగ్ మూవీగా `యానిమల్` నిలిచింది. ఇది మూడుగంటల ఇరవై నిమిషాలకు పైగా ఉంది. ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎదిమిది వందల కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కంటెంట్ ఉంటే సినిమా నిడివితో సంబంధం లేదని నిరూపించింది. ఇప్పుడు `పుష్ప 2` విషయంలోనూ మేకర్స్ అదే ప్లాన్ చేస్తున్నారు. ఈవిషయంలో `యానిమల్` డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాని ఫాలో అవుతున్నారు సుకుమార్.
`యానిమల్` తరహాలోనే చాలా లాంగ్‌గా సినిమాని కట్ చేశారట. నిడివిని తాజాగా ఫిక్స్ చేశారట. సినిమా బాగుంటే నిడివి సమస్య కాదు, లేదంటే మాత్రం విమర్శలు తప్పవు. అది డిజాస్టర్ కి కారణమవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక, ఇతర టీమ్ సినిమా పట్ల చాలా కన్ఫిడెంట్‌గా ఉన్నట్టు తెలుస్తుంది.