హైదరాబాద్ లో సొంతిళ్లు మీ కలా..: అయితే రేవంత్ సర్కార్ బంపరాఫర్ మీకోసమే

First Published | Nov 26, 2024, 5:10 PM IST

హైదరాబాద్ లో సొంతింటి కలను నిజం చేసుకునే అద్భుత అవకాశాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ కల్పిస్తోంది. అంతేకాదు ఇంటి స్థలాలు, భవనాలను కూడా ప్రజలకు అందుబాటులో వుంచుతోంది ప్రభుత్వం. 

House in Hyderabad

House in Hyderabad : సొంత ఇళ్ళు వుండాలనేది ప్రతిఒక్కరి కోరిక. కానీ హైదరాబాద్ వంటి మహా నగరాల్లో సామాన్యులకు సొంతిళ్లు అనేది అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. వేతన జీవుల కష్టార్జితమంతా కుటుంబపోషణ, పిల్లల చదువులు, ఇతర ఖర్చులకే సరిపోతుంది... వీటన్నింటిని దాటుకుని ఎంతో కొంత వెనకేసుకున్న ఇప్పుడున్న ధరలకు ఇల్లు కొనడానికి సరిపోవు. ఇలా చాలామందికి సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది... అద్దె ఇంట్లోనే వారి జీవితం గడిచిపోతోంది. 

అయితే హైదరాబాద్ లో సొంతిల్లు, అపార్ట్ మెంట్ ప్లాట్ కోసం చూస్తున్నవారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. గతంలో రాజీవ్ స్వగృహ కార్పోరేషన్ ద్వారా సేకరించిన ప్లాట్లు, అపార్ట్ మెంట్ప్ తో పాటు ఇతర భూముల అమ్మకానికి ప్రభుత్వం సిద్దమయ్యింది. వేలం ద్వారా వీటిని అమ్మేందుకు సిద్దమైన సర్కార్ ఇందుకోసం కసరత్తు చేస్తోంది. 

ఇప్పటికే అమ్మకానికి సిద్దం చేసిన ఆస్తులను వచ్చేనెల డిసెంబర్ నుండి వేలం వేయనున్నారు. దశలవారిగా ఆస్తుల వేలం ప్రక్రియ జరుగుతుంది... ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ వేలంలో పాల్గొని ఇళ్లు లేదంటే స్థలం కొనుగోలు చేయవచ్చు. ఇలా హైదరాబాద్ లో సొంతింటి కలను నిజం చేసుకునే అవకాశాన్ని రేవంత్ సర్కార్ కల్పిస్తోంది. 
 

Rajiv Swagruha

హైదరాబాద్ లో వేలంవేసే ఆస్తులివే..: 

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా ఇళ్ళ నిర్మాణంకోసం రాజీవ్ స్వగృహ కార్పోరేషన్ ఏర్పాటు చేసారు. 2007లో ఏర్పాటుచేసిన ఈ కార్పోరేషన్ కు భారీగా ప్రభుత్వ స్థలాలు కేటాయించారు. ఈ స్థలాల్లో భారీ అపార్ట్ మెంట్స్, ఇళ్ల నిర్మాణం చేపట్టి విక్రయించారు. అయితే హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో ఈ కార్పోరేషన్ కు ఇంకా భూములు, అసంపూర్తిగా వదిలేసిన అపార్ట్ మెంట్లు వున్నాయి. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పలు ప్రాంతాల్లోని రాజీవ్ స్వగృహ నిర్మాణాలను అమ్మేసారు. ఇదే పని ప్రస్తుత రేవంత్ సర్కార్ కూడా చేస్తోంది. ఎన్నికల వేళ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నిధులు సమీకరించుకునేందుకు రాజీవ్ స్వగృహ కార్పోరేషన్ ఆస్తులను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది. 

కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి సిద్దమైన రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్స్, భూములు హైదరాబాద్ లోనే ఎక్కువగా వున్నాయి. ఇక్కడే 760 ప్లాట్లు వుండగా పలు ప్రాంతాల్లో గతంలోనే అపార్ట్ మెంట్స్ నిర్మించారు. వాటిలో 36 అసంపూర్తిగా వున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గాజులరామారం,  జవహర్ నగర్, పోచారంలో 26 టవర్లు వున్నాయి. 

ఇక హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో కూడా భూముల వేలానికి రేవంత్ ప్రభుత్వం సిద్దమయ్యింది. సుమారు 136 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 65 ఎకరాలు, మేడ్చల్ జిల్లాలో 53 ఎకరాలు వున్నాయి. ఇక ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో మరో 18 ఎకరాలను కూడా ప్రభుత్వం వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. 
 


Rajiv Swagruha

తెలంగాణవ్యాప్తంగా వేలం వేయనున్న ఆస్తులివే..: 

రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లోని రాజీవ్ స్వగృహ ఆస్తులను వేలం వేయడానికి సిద్దమయ్యింది. ఈ స్థలాలు, నిర్మాణాల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు మూడు ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటుచేసింది. ఆ  కమిటీలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయి... వీటిని సమీక్షించిన ప్రభుత్వం దశల వారిగా వేలంపాట నిర్వహించి ఆస్తులు అమ్మేందుకు సిద్దమయ్యింది. 

హైదరాబాద్,మేడ్చల్, రంగారెడ్డితో పాటు ఖమ్మం, మహబూబ్ నగర్, కామారెడ్డి,నల్గొండ,గద్వాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్ లో భారీగా ఇళ్లు,  ప్లాట్లు ఖాళీగా వున్నాయి. వీటిని కూడా వేలంపాటలో వుంచనున్నారు.

ఇకహైదరాబాద్ లో చాలా విలువైన స్థలాలను ప్రభుత్వం ఈ వేలంపాట ద్వారా విక్రయించనుంది. దీని ద్వారా రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా స్థలాలు, ఇళ్ల ద్వారా రూ.652 కోట్లు, ప్లాట్ల ద్వారా రూ.129 కోట్లు, భవనాల ద్వారా రూ.725 కోట్లు, భూముల ద్వారా రూ.494 కోట్ల సమకూరుతాయని అంచనా వేస్తున్నారు. 

Latest Videos

click me!