వందల కోట్ల ఆస్తులు, ఎనలేని కీర్తి, కానీ ఈ స్టార్స్ కి పెళ్లి మాత్రం కాలేదు!

First Published | Nov 26, 2024, 5:20 PM IST

40, 50 ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకోని బాలీవుడ్ స్టార్స్ ఎవరో చూద్దాం. వందల కోట్ల ఆస్తులు, కీర్తి ఉన్న సల్మాన్, టబు వంటి సెలెబ్స్ ఈ లిస్ట్ లో ఉన్నారు. 

బాలీవుడ్ ప్రముఖులు వృత్తితో పాటు వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తారు. కొందరు స్టార్స్ పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితం అనుభవిస్తున్నారు. వందల కోట్ల ఆస్తులు, కీర్తి ఉన్న సల్మాన్, టబు వంటి సెలెబ్స్ ఈ లిస్ట్ లో ఉన్నారు. 

సల్మాన్ ఖాన్: బాలీవుడ్‌లో  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఎవరు అంటే..  58 ఏళ్ల సల్మాన్ ఖాన్. ఈ కండల వీరు అనేక మంది స్టార్స్ తో అఫైర్స్ నడిపారు. పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇకపై చేసుకునే అవకాశం కూడా లేదు. అందుకు కారణం ఏమిటో తెలియదు. ఐశ్వర్య రాయ్ నుండి జాక్వీలిన్ వరకు అనేక మంది సల్మాన్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్నారు 



టబు: నాగార్జునతో హీరోయిన్ టబు ఎఫైర్ నడిపారనే పుకారు ఉంది. అలాగే అజయ్ దేవ్ గణ్-టబు ఘాడంగా ప్రేమించుకున్నారని అంటారు. కాగా 51 ఏళ్ల టబు ఇప్పటికీ ఒంటరిగా, జీవిస్తున్నారు. సింగిల్ లైఫ్ హ్యాపీగా ఉందని ఆమె అంటారు. టబు కూలీ నెంబర్ వన్, నిన్నే పెళ్లాడతా, ఆవిడా మావిడే చిత్రాల్లో నటించింది. 

కరణ్ జోహార్: 50 ఏళ్ల ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ పెళ్లి చేసుకోలేదు, కానీ సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు.

తుషార్ కపూర్: 47 ఏళ్ల తుషార్ కపూర్ 2016లో సరోగసీ ద్వారా తండ్రయ్యాడు, పెళ్లి చేసుకోలేదు, కొడుకుతో జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు.
 

అమీషా పటేల్: విక్రమ్ భట్ తో అమీషా పటేల్ సీరియల్ రిలేషన్ నడిపిందనే పుకార్లు ఉన్నాయి. 48 ఏళ్ల అమీషా పటేల్ పెళ్లి చేసుకోలేదు, ఒంటరిగా ఉండటం సంతోషంగా ఉందని చెబుతుంది.

అక్షయ్ ఖన్నా: 48 ఏళ్ల నటుడు అక్షయ్ ఖన్నా కూడా పెళ్లి చేసుకోలేదు, అయితే కరిష్మా కపూర్‌తో అతని ఎఫైర్ ఒకప్పుడు చర్చనీయాంశం అయ్యింది. తాల్ మూవీతో ఆయన బ్లాక్ బస్టర్ కొట్టాడు. 

ఉదయ్ చోప్రా: ప్రముఖ చిత్ర నిర్మాత యష్ చోప్రా చిన్న కుమారుడు ఉదయ్ చోప్రా 2000లో 'మొహబ్బతే'తో అరంగేట్రం చేశాడు. 51 ఏళ్ల ఉదయ్ చోప్రా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.

దివ్య దత్తా: దివ్య దత్తాకి 2005లో లెఫ్టినెంట్ కమాండర్ సందీప్ షెర్గిల్‌తో నిశ్చితార్థం జరిగింది, కానీ ఆ పెళ్లి రద్దు అయ్యింది. అనంతరం ఆమె పెళ్లి చేసుకోలేదు.

Latest Videos

click me!