Omicron: ఒమిక్రాన్ ను సోకిందని గుర్తించడం ఎలా? దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?

First Published Jan 18, 2022, 11:08 AM IST


Omicron: ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ సునామిలా విరుచుకుపడుతోంది. ఎప్పుడు దీని బారిన పడి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందోనని ప్రజలు బిక్కు బిక్కు మంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒమిక్రాన్ సోకిందని గుర్తించడం ఎలా..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? అది వస్తే తీసుకోవాల్సి జాగ్రత్తలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.


Omicron: రెండేండ్ల నుంచి యావత్ ప్రపంచాన్ని తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తూ ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా మహమ్మారి. ఈవైరస్ పూటకో రూపాన్ని మారుస్తూ ప్రజలపై విరుచుకుపడుతోంది. ఇక తాజాగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సునామిలా మారి ప్రజలను గజగజవణికిస్తోంది. ఈ వేరియంట్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తూ ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఈ వేరియంట్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉంటుందని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. ఈ వైరస్ వేగంగా ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నా.. లక్షణాలు మాత్రం తేలికపాటివేనని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాగా ఒమిక్రాన్ బారిన పడిన కొందరిలో డెల్టా వేరియంట్ మాదిరి లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు. మరికొందరిలో అయితే కొత్త లక్షణాలు కనిపించనట్టుగా నిపుణులు వెళ్లడిస్తున్నారు. అయితే ఒమిక్రాన్ సోకితే సాధారణంగా కనిపించే లక్షణాలు, అది సోకితే ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
 

లక్షణాలు:  ఒమిక్రాన్ ప్రధాన లక్షణాలలో గొంతు నొప్పి ఒకటి. గొంతు నొప్పిగా అనిపిస్తే కూడా ఒమిక్రాన్ సోకిందని అర్థం చేసుకోవాలి. అలాగే తరచుగా అలసటకు గురైనా, తలనొప్పి వేధించినా, ముక్కు కారడం, గొంతులో గరగర, తుమ్ములు రావడ వంటి సమస్యలు మీలో కనిపిస్తే మీకు ఒమిక్రాన్ సోకినట్టుగా నిర్ధారించుకోవాలి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. వైద్యులకు మీలో కనిపించిన లక్షణాలన్నింటినీ తెలియజేసి ఆర్టీపీసీఆర్ టెస్ట్ ను చేయించుకోవాలి. అయితే ఈ లక్షణాలను డిసెంబర్ 3 నుంచి 10 మధ్యలో వైద్యులు గుర్తించారు. ఎందుకంటే ఆ సమయంలోనే ఒమిక్రాన్ కేసులు బారీగా పెరిగాయి. 

ఆర్టీపీసీఆర్ టెస్ట్ అంటే ఏమిటీ, ఎందుకు చేస్తారు: ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే.. మనిషి శరీరంలోకి ఈ వైరస్ యొక్క జీన్స్ వెళ్లిందని నిర్దారించుకోవడానికి ఈ టెస్ట్ బాగా ఉపయోగపడుతుంది. ఈ టెస్ట్ ను జెనెటిక్ మెటీరియల్ తో చేస్తారు. ముక్కు లేదా, గొంతు నుంచి శాంపిల్ తీసుకోవడానికి పాలిమరైజ్ అనే చైన్ సిస్టమ్ ను ఉపయోగిస్తారు. ఈ టెస్ట్ ద్వారానే వైరస్ మీ శరీరంలోకి ప్రవేశించిందా లేదా అనేది నిర్దారించబడుతుంది. ఎలా అంటే ఒమిక్రాన్ లో న్యూక్లియోక్యాప్సిడ్(N2), స్పెక్(S), ఎన్వలప్(E)అనే భాగాలు ఉంటాయి. ఇవి మీ శరీరంలోకి వెళితే వైరస్ సోకిందని అర్థం. అదే ఈ టెస్ట్ ద్వారా మీ శరీరంలో  E, S, N2 లు కనిపించకపోతే మీకు ఒమిక్రాన్ సోకలేదని నిర్దారించబడుతుంది. 

జాగ్రత్తలు: అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. ఎక్కడికి వెళ్లినా మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఎప్పటికప్పుడు శానిటైజ్ ద్వారా చేతులను శుభ్రం చేసుకోవాలి. జనాల్లోకి వెళ్లినప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ముఖ్యంగా జన సమూహాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 

టెస్ట్ ఎప్పుడు అవసరం:  ఒమిక్రాన్ లక్షణాలు మీలో కనిపించని వెంటనే ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే మీ నుంచి ఇతరులకు సోకకూడదంటే ఈ టెస్ట్ తప్పనిసరి. అలాగే మీకు తెలియకుండా కరోనా సోకిన వ్యక్తితో నేరుగా మాట్లాడినప్పుడు అవసరం. అలాగే వేరే రాష్ట్రాలకు, దేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా ఈ టెస్ట్ మస్ట్. 
 

click me!