ట్యాప్ వాటర్ కూల్ గా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

First Published Jun 5, 2024, 9:51 AM IST

ఎండాకాలంలో ఇంటిపై కప్పుపై ఉండే వాటర్ ట్యాంకులో నీళ్లు వేడిగా అవుతాయి. దీనివల్ల ఇంట్లో ఉండే ప్రతి ట్యాప్ నుంచి నీళ్లు వేడి వేడిగా వస్తుంటాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు ట్యాప్ వాటర్ ను చాలా ఫాస్ట్ గా కూల్ చేయొచ్చు. అదెలాగో..

ఎండాకాలంలో ఇంట్లో ఉండే ప్రతి ట్యాప్ నుంచి నీళ్లు చాలా వేడిగా వస్తుంటాయి. ఇంటి పైకప్పుపై వాటర్ ట్యాంకు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఎండ పొద్దంతా తగలడం వల్లే నీరు వేడిగా ఉంటుంది.  కొన్ని కొన్ని సార్లు వీటితో స్నానం కూడా చేయలేనంతగా వేడిగా అవుతాయి. అలాగే గిన్నెలను కూడా కడగలేం. అయితే కొన్ని చిట్కాలతో వేడి వేడి ట్యాప్ వాటర్ ను కూల్ గా చేయొచ్చు. 
 

ఉదయం లేదా సాయంత్రం నీటిని ఉపయోగించండి

ట్యాప్ వాటర్ ఉదయం లేదా సాయంత్రం చల్లగా ఉంటుంది. ఈ టైం లో మీరు నీళ్లను ఉపయోగించొచ్చు. కావాలనుకుంటే ఉదయం, రాత్రి పూట నీళ్లను బకెట్ లో నింపి వీటిని మీరు అదే నీటిని వాడుకోవచ్చు. ఉదయం ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో నీళ్లు చల్లగా ఉంటాయి.

Latest Videos


tap water

ఐస్ క్యూబ్స్ 

ట్యాప్ వాటర్ నుంచి వచ్చే నీళ్లను వెంటనే చల్లగా చేయాలనుకుంటే ఒక బకెట్ నీటిలో ఒక గ్లాసు ఐస్ క్యూబ్స్ ను వేయండి. ఇవి కరిగిన వెంటనే బకెట్ నీళ్లు మొత్తం మీరు స్నానం చేయడానికి పనికొచ్చేలా అవుతాయి. వేడివేడి నీళ్లు కాస్త సాధారణంగా మారుతాయి. 


గాలి వెలుతురు వచ్చే ప్రదేశంలో

వేడివేడి కుళాయి నీళ్లు చల్లగా కావాలనుకుంటే కుళాయి నుంచి పట్టిన వేడి నీటిని ఒక ఐదారుగంటలు బహిరంగ ప్రదేశంలో పెట్టండి. వేడినీటికి గాలి తగిలితే అవి చల్లబడటం మొదలవుతుంది. అలాగే మీరు స్నానం చేయడానికి సౌకర్యవంతంగా ఉంటాయి. 

ప్లాస్టిక్ బకెట్ లో నీటిని ఉంచండి

ఒక పెద్ద ప్లాస్టిక్ బకెట్ ను తీసుకుని అందులో నీటిని నింపండి. దీనికి చుట్టూ ఒక మందపాటి గుడ్డను చుట్టండి. లేదా బకెట్ పై నీటితో నానబెట్టిన జనపనార సంచిని కూడా చుట్టండి. ఇలా చేయడం వల్ల వేడి కుళాయి నీరు తక్కువ సమయంలోనే చల్లబడుతుంది.

click me!