గీజర్ ను ఎలా వాడాలో తెలుసా?

First Published | Nov 4, 2024, 4:43 PM IST

చలికాలంలో చాలా మంది ఇండ్లలో గీజర్లను వాడుతుంటారు. కానీ వీటిని ఎలా వాడాలి? ఎంతసేపు వాడాలో మాత్రం చాలా మందికి తెలియదు. మీరు గనుక గీజర్ ను చాలా కాలం వాడాలనుకుంటే వీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

దీపావళి తర్వాత చలి ఎక్కువైంది. చలికాలంలో గీజర్ల వాడకం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కూల్ వాటర్ తో స్నానం చేయడం, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం కష్టంగా ఉంటుంది. అందుకే చాలా మంది ఈ పనులు చేయడానికి ఖచ్చితంగా గీజర్లను వాడుతుంటారు. కానీ గీజర్లను ఎక్కువగా వాడటం మంచిది కాదు. 

చలికాలంలో ప్రతి పనికి వేడి నీటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. దీనివల్ల గంటల తరబడి గీజర్లు పనిచేస్తూనే ఉటాయి. గీజర్ ను ఎక్కువ సేపు ఆన్ చేసి ఉంచడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గీజర్ ఎంతసేపు పని చేయాలి?

ఏ ఎలక్ట్రిక్ పరికరాన్నైనా గంటల తరబడి ఉపయోగించడం మంచిది కాదు. అది ఏసీ అయినా కావొచ్చు గీజర్ అయినా కావొచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాలను ఎప్పుడూ ఉపయోగించకపోవడమే మంచిది. సాధారణంగా మంచి నాణ్యత గల గీజర్లను 1 లేదా 2 గంటలకు మించి కంటిన్యూగా ఆన్ లో ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. 

మార్కెట్ లో ఎన్నో ఆటోమేటిక్, సేఫ్టీ ఫీచర్-రిచ్ గీజర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి వాటంతట అవే నీళ్లు వేడి అయినా తర్వాత స్విచ్  ఆఫ్ అవుతయాి. అలాగే వాటిని ఉపయోగించిన తర్వాత మాత్రమే ఆన్ అవుతాయి.

గీజర్లను ఎక్కువగా ఉపయోగించడం ఎందుకు మంచిది కాదు?

కరెంట్ బిల్లు

మీకు తెలుసా? గీజర్లు కరెంట్ ను బాగా వినియోగిస్తాయి. ఇలాంటి పరిస్థితిలో మీరు గీజర్ ను గంటల తరబడి ఎప్పుడూ ఉపయోగించడం వల్ల మీ కరెంట్ బిల్లు విపరీతంగా వస్తుంది.

మీరు గనుక కరెంట్ బిల్లును కంట్రోల్ చేయాలనుకుంటే చలికాలంలో గంటల తరబడి గీజర్ ను ఆన్ లో ఉంచకూడదు. మీకు వేడి నీళ్లు అవసరమయ్యే ముందు మాత్రమే గీజర్ ను ఆన్ చేయండి. అలాగే ఉపయోగించిన తర్వాత మర్చిపోకుండా స్విచ్ ఆఫ్ చేయండి.

Latest Videos


ఎక్కువ వేడి

మీకు తెలుసా? ఒక్కో గీజర్ కు ఒకేసారి కొన్ని లీటర్ల నీటిని మాత్రమే వేడి చేసే సామర్థ్యం ఉంటుంది. ఉదాహరణకు మీ ఇంట్లో 5 లేదా 10 లీటర్ల సామర్థ్యం ఉన్న గీజర్ ఉంటే అది ఒకేసారి ఇంతమొత్తంలోని నీటిని మాత్రమే వేడి చేయగలదు.

మీరు ఈ 5 లీటర్ల నీటిని ఖాళీ చేసే వరకు వాటిని మరిగిస్తూనే ఉంటుంది. నీళ్లు ఎక్కువ సేపు మరగడం వల్ల మూలకాలు లేదా గీజర్ లోని ఇతర అంతర్గత భాగాలు పని చేయకపోవచ్చు. గీజర్ భాగాలు పాడైతే వాటిని రిపేర్ చేయడానికి చాలా ఖర్చవుతుంది. 

ప్రమాదం జరిగే అవకాశం 

మీరు గీజర్ ను గంటల తరబడి వాడితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. గీజర్లను ఎప్పుడూ ఉపయోగించడం వల్ల ఓవర్ హీటింగ్ అవుతుంది.చాలా వేడెక్కడం వల్ల గీజర్ అంతర్గత భాగాలు దెబ్బతింటాయి.

ఇది షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే మీరు గీజర్ ఉపయోగించే టైంలో నే ఆన్ చేయాలి. అవసరం తీరిన తర్వాత ఖచ్చితంగా ఆఫ్ చేయాలి. 
 

నీటి వృథా..

మీ గీజర్ ఎప్పుడూ ఆన్ లోనే ఉంటే నీరు వృథా అవుతుంది. అందుకే నీళ్లు వృథా కాకుండా ఉండటానికి ఇతర సమస్యలు రాకుండా ఉంటానికి గీజర్లను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి.

గీజర్ ను ఉపయోగించేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

రెగ్యులర్ చెకప్ లు: చలికాలం రాకముందే ఎలక్ట్రీషియన్ తో మీ గీజర్ ను చెక్ చేయించండి. అలాగే మీరు కూడా గీజర్ ను రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండండి. దీంతో మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.
 

bathroom vastu tips

బ్యాడ్ గీజర్: మీ గీజర్ కు ఏదైనా సమస్య ఉంటే దానికి ఉపయోగించకపోవడమే మంచిది. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఎలక్ట్రీషియన్ కు ఫోన్ చేసి గీజర్ ను రిపేర్ చేయించండి. ఇలాంటి వాటిని ఉపయోగించడం వల్ల కరెంట్ షాక్, షార్ట్ సర్క్యూట్ లేదా మరేదైనా సమస్య తలెత్తే అవకాశం ఉంది. 

నీటిని దూరంగా ఉంచండి: గీజర్ లో వేడినీళ్లను ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తుండాలి. లేదంటే వేడి వల్ల గీజర్ లోని భాగాలు దెబ్బతింటాయి. 

వెంటిలేషన్ విషయంలో జాగ్రత్తలు : బాత్రూమ్ లో గీజర్ ఇన్ స్టాల్ చేసుకుంటే వెంటిలేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గీజర్ ను వేడెక్కే సమస్య నుంచి రక్షించడానికి గాలి, వెంటిలేషన్ చాలా అవసరం.
 

click me!