చలికాలంలో పాదాల రక్షణ.. పగుళ్లు రాకుండా ఉండాలంటే..

First Published Dec 27, 2020, 10:16 AM IST

చలికాలం వచ్చిందంటే చాలు పాదల పగుళ్లు బాధ పెడతాయి. అందమైన పాదాలు పగుళ్లతో అందవికారంగా మారిపోతాయి. నడకలో నొప్పి పుట్టిస్తూ నడకనే మార్చేస్తాయి. వీటిని అలాగే వదిలేస్తే పాదాల పగుళ్ళనుండి రక్తం కారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే శీతాకాలం లో మీ పాదాలను మృదువుగా, మాయిశ్చరైజ్డ్ గా ఉంచుకోవాలి.

చలికాలం వచ్చిందంటే చాలు పాదల పగుళ్లు బాధ పెడతాయి. అందమైన పాదాలు పగుళ్లతో అందవికారంగా మారిపోతాయి. నడకలో నొప్పి పుట్టిస్తూ నడకనే మార్చేస్తాయి.
undefined
వీటిని అలాగే వదిలేస్తే పాదాల పగుళ్ళనుండి రక్తం కారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే శీతాకాలం లో మీ పాదాలను మృదువుగా, మాయిశ్చరైజ్డ్ గా ఉంచుకోవాలి.
undefined
శీతాకాలంలో చలినుండి రక్షణ కొరకు పాదాలకు సాక్స్ లు వేసుకుంటాం. ఇక అంతకంటే రక్షణ వేరే చేయం. దీనివల్ల పాదాలు పొడిబారిపోయి పగుళ్లు ఏర్పడతాయి. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే శీతాకాలంలో కూడా మీ పాదాలు మృదువుగా, మెరుస్తూ అందంగా ఉంటాయి.
undefined
వారానికి రెండు రోజులు గోరు వెచ్చని నీటిలో ఉప్పు, నిమ్మరసం కలిపి ఆ నీటిలో మీ పాదాలను పది నిమిషాలు ఉంచండి. ఆ తరువాత డ్రై స్కిన్ ని మృదువుగా స్క్రబ్ చేయాలి.
undefined
స్క్రబ్ చేసిన వెంటనే ఏదైనా ఫుట్ క్రీం రాయాలి. మీకు మరీ డ్రై స్కిన్ ఉంటే స్పెషలైజ్డ్ క్రీంస్ తీసుకోండి, ఇవి మామూలు వాటి కంటే థిక్ గా ఉంటాయి. అలాగే, రాత్రి నిద్రకి ముందు ఫుట్ క్రీం అప్లై చేయడం అలవాటు చేసుకోండి.
undefined
పాదాల మసాజ్ వల్ల డ్రై స్కిన్ కి మంచి జరగడమే కాక పాదాల అలసట పూర్తిగా పోతుంది, రిలాక్స్డ్ గా అనిపిస్తుంది, కొబ్బరి నూనె, నెయ్యి, బాదం నూనె, నువ్వుల నూనె వంటి వాటితో మసాజ్ చేస్తే సర్క్యులేషన్ బాగా జరిగి పాదాలు తేమని కోల్పోకుండా ఉంటాయి.
undefined
ఇంకా డ్రై హీల్స్ సమస్య తగ్గక పోతే పెట్రోలియం జెల్లీ యూజ్ చేయండి. ఇది పగిలిన పాదాలకి అద్భుతంగా పని చేస్తుంది. శుభ్రం గా ఉన్న పాదాలకి ఇది అప్లై చేసి సాక్స్ తో కవర్ చేయండి. ఇందు వల్ల మాయిశ్చర్ బైటికి పోకుండా అక్కడే ఉంటుంది.
undefined
చలి చంపేస్తుందని బాగ వేడినీటితో స్నానం చేస్తుంటారు. అయితే ఇది అస్సలు మంచిది కాదు. వేడినీరు శరీరంలోని తేమను హరిస్తుంది. అందుకే గోరు వెచ్చని నీరు మాత్రమే వాడండి.
undefined
దీంతోపాటు మైల్డ్, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ క్లెన్సర్ వాడండి. క్లోజ్డ్ గా ఉండే హీల్స్ ఉన్న షూస్ వేసుకోండి.
undefined
వీటితో పాటు కాటన్ సాక్స్ ధరించడం కూడా మంచిదే. అలాగే ఎక్కువ సేపు ఒకే పొజిషన్ లో నిలబడి ఉండకండి.
undefined
చలికాలంలో దాహం వేయదు. అలాగని నీరు తాగకుండా ఉండకూడదు. బాగా నీరు తాగాలి. ఎక్కువ సేపు నడవ వలసి వస్తే మధ్య మధ్య లో ఆగి పాదాలకి విశ్రాంతిని ఇస్తూ నడవండి.
undefined
చలి కదా అని వేడి షవర్ కింద ఎక్కువ సేపు ఉండకూడదు. ఐదు పది నిమిషాల కంటే ఎక్కువ సేపు స్నానం చేయకండి.స్నానం తరువాత పాదాలని అద్దినట్లు గా తుడవండి.
undefined
ఇంట్లో అయినా సరే ఈ కాలం లో చెప్పులు వేసుకునే ఉండండి, లేదా కనీసం సాక్స్ వేసుకుని నడవండి.
undefined
click me!