Prasanna Vadanam Review: `ప్రసన్నవదనం` మూవీ రివ్యూ.. సుహాస్ ఖాతాలో మరో హిట్ పడిందా..?

First Published | May 3, 2024, 2:48 PM IST

టాలీవుడ్ లో నేచురల్ స్టార్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది నాని. కాని ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మరో నేచురల్ స్టార్ దొరికాడు. కమెడియన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. హీరోగా మారి.. మంచి మంచి కాన్సెప్ట్ లు సెలక్ట్ చేసుకుంటూ.. సందడి చేస్తున్నాడు సుహాస్. ఈరోజు సుహాస్ నటించిన  ప్రసన్నవదనం సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. మరి ఈ సినిమా తో మరో హిట్ ను సుహాస్ తన ఖాతాలో వేసుకున్నాడా..? 

సుహాస్ హీరోగా.. పాయల్ రాధాకృష్ణన్, రాశీ సింగ్ హీరోయిన్లు గా .. అర్జున్ వైకే ద‌ర్శ‌క‌త్వం లో క్రైమ్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌ లో రూపొందిన సినిమా ప్రసన్న వదనం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా  ఈమూవీ రిలీజ్ అయ్యింది. ఇక ఈసినిమా కథ విషయానికి వస్తే.. ? హీరో సూర్య (సుహాస్) ఎఫ్ఎం స్టేషన్ లో ఆర్జేగా ప‌నిచేస్తుంటాడు. ఈక్రమంలో సూర్య ఫ్యామిలీకి యాక్సిడెంట జరిగి తల్లీ తండ్రులను కోల్పోతాడు. అంతే కాద ఆ  యాక్సిడెంట్ కారణంగా తన తలకు గట్టిగా దెబ్బ తగలడంతో ఫేస్ బ్లైండ్ నెస్ డిజార్డర్ కూడా హీరోకు వస్తుంది.  ఈజబ్బు కారణంగా ఎదుటి వారి ముఖాల‌ను, వారి వాయిస్‌ను గుర్తుప‌ట్ట‌లేడు. అయితే తనకు ఉన్న ఈసమస్య వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా మ్యానేజ్ చేస్తుంటాడు సుహాస్. 
 

ఈక్రమంలో ఓ సంఘటన జరుగుతుంది. ఓ రోజు రాత్రి హీరో ఇంటికి వెళ్తుంటే..అమృత అనే అనే అమ్మాయిని ధారుణంగా లారీ కింద తోసి చంపేస్తారు. ఆ హత్యను  సూర్య చూస్తాడు. కాని సూర్యాకు ఉన్న ప్రాబ్లమ్ వల్ల హంతకుడు ఎవరు అనేది గుర్తు పట్టడు. సూర్య‌కు ఫేస్ బ్లైండ్ నెస్ వుండటం వ‌ల్ల హంత‌కుడిని గుర్తించ‌లేడు. హ‌త్య‌కు గురైన అమృత‌కు ఎలాగైనా  న్యాయం  చేయాలని హత్య గురించి . పోలీసుల‌కు  చెబుతాడు? అమృత మ‌ర్డ‌ర్ కేసును సాల్వ్ చేసే బాధ్య‌త‌ను చేప‌ట్టిన ఏసీపీ వైదేహి( రాశి సింగ్) ఎస్ఐ( నితిన్ ప్రసన్న) కేసులోని నిజాల‌ను బయటకు తీస్తారు. అప్పడు ఓ షాకింగ్ విషయం బయటకు వస్తుంది. ఇంతకీ ఆ విషయం ఏంటి..? ఈ హత్యకు సూర్యకు లింక్ ఏంటి..? ఫేస్ బ్లైండ్ నెస్ కారణంగా సూర్య ఏ విధ‌మైన‌ కష్టాలు ఎదుర్కున్నాడు ? అసలు అమృత ఎవరు ? అన్న‌ది సినిమా చూసి తెలుసకోవల్సిందే. 

ధనుష్ లేకుండానే ఐశ్వర్య రజినీకాంత్ గృహ ప్రవేశం.. కొత్తిల్లు కొన్న సూపర్ స్టార్ కూతురు..
 


ఇక సినిమా ఎలా ఉందంటే..? ఈసినిమాను చాలా బాగా డ్రైవ్ చేశాడు దర్శకుడు. కథను అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రతీ సీన్ ఉత్కంటభరితంగా  సాగిపోతుంది. ఇప్పటికే ఇలాంటి డిజార్దర్స్ కథతో చాలా సినిమాలు వచ్చాయి. కాని ఈ కథను మాత్ర కొత్తగా అల్లుకున్నాడు దర్శకుడు అర్జున్. ఇక సూర్య తల్లీతండ్రులు చనిపోవడం.. అతనికి డిజార్డర్ రావడం..దాన్ని మ్యానేజ్ చేయడంకోసం స్నేహితుల సహాయం తీసుకోవడం..ఇలా సెంటిమెంట్, క్రైమ్, కామెడీ అన్నీ అంశాలు కలిసి.. అనుకున్న కథను అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. అంతే కాదు పాయల్ రాధాకృష్ణన్ తో లవ్ ట్రాక్.. రొమాన్స్.. థ్రిల్లింగ్ అంశాలతో పాటు.. ఇట్రవెల్ ట్విస్ట్ కు నిజంగా ఇంప్రెస్ అవుతారు ఆడియన్స్. ఫస్ట్ హాఫ్ అంత సాఫీగా సాగిపోతే.. సెకండ్ హాఫ్ లో సీటులోంచి లేవకుండా ఉత్కంఠభరితంగా.. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తూ.. కథ సాగుతుంది. 

రోజా, లయ, గౌతమి కూతుర్లను చూశారా..? హీరోయిన్లను మించిన అందం వారి సొంతం..
 

ఇక నటీనటుల విషయానికి వస్తే.. సుహాస్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. తన పని తాను ఇంకాస్త మెరుగ్గానే చేసుకుంటూ వెళ్తుంటాడు. ఇక హీరోయిన్ పాయల్ సుహాస్ తో రొమాంటిక్ సీన్స్ ఇరగదీసింది. ఇక రాశీ సింగ్, ప్రసన్నా.. వైవా హర్షలు తమ పాతర పరిది వరకూ బాగా నటించారు. కమెడియన్ సత్యాది చిన్న పాత్రే అయినా.. సినిమాకు బాగా ఉపయోగపడిందీ పాత్ర. ఇక మగతా నటీనటులు కూడా ఎవరి పాత్రల పరిది మేరకు వారు బాగా నటించారు. 
 

టెక్నికల్ టీమ్  కూడా బాగా పనిచేశారు. దర్శకుడు అర్జున్ క్వాలిటీ వర్క్ చూపించాడు. బేబీ సినిమాతో మంచి హిట్ ను ఖాతాలో వేసకుని.. అలరించిన విజయ్ బుల్గానిన్..ఈసినిమాకు కూడా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు. ఇక ఈసినిమా అద్బుతం అని చెప్పడానికి కారణాలలో సినిమాటో గ్రాఫీ కూడా ఒకటి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొత్తానికి ప్రసన్నవదనం సినిమా.. అన్ని వార్గాల వారు చూడదగ్గ సినిమా. సుహాస్ మరో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడన్నది నిజం. మరిముందు ముందు రోజుల్లో ఈసినినిమా గురించి ఏంచెపుతారాో చూడాలి. 

రేటింగ్‌ః3/5
 

Latest Videos

click me!