ఈ వంటింటి చిట్కాలతో రాలే జుట్టుకు చెక్...

First Published Jun 4, 2021, 1:06 PM IST

ముఖానికి అందాన్నిచ్చేది ఏదీ అంటే ఠక్కున చెప్పే సమాధానం ఒత్తైన జుట్టు. అందమైన తలకట్టు అతివలకే కాదు పురుషులకూ అందాన్నిస్తుంది. జుట్టు రాలిపోవడంతో వయసు మీద పడినట్టుగా కనిపిస్తారు. నేటి కాలుష్యపూరిత వాతావరణంలో వయసుతో సంబంధం లేకుండా  ఆడా, మగా తేడా లేకుండా అందరూ ఎదుర్కొనే అతి పెద్ద సమస్య జుట్టు రాలిపోవడం. 

ముఖానికి అందాన్నిచ్చేది ఏదీ అంటే ఠక్కున చెప్పే సమాధానం ఒత్తైన జుట్టు. అందమైన తలకట్టు అతివలకే కాదు పురుషులకూ అందాన్నిస్తుంది. జుట్టు రాలిపోవడంతో వయసు మీద పడినట్టుగా కనిపిస్తారు.
undefined
నేటి కాలుష్యపూరిత వాతావరణంలో వయసుతో సంబంధం లేకుండా ఆడా, మగా తేడా లేకుండా అందరూ ఎదుర్కొనే అతి పెద్ద సమస్య జుట్టు రాలిపోవడం.
undefined
తల దువ్వుకోవాలంటే భయపడేలా తలలో దువ్వెన పెట్టగానే జుట్టు చేతికి వచ్చేస్తుంటుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఈ సమస్యనుంచి బయటపడలేం. రాలే జుట్టును ఆపలేం.
undefined
సాధారణంగా ఆడవాళ్లైనా, మగవాళ్లైనా రోజూ 50 నుంచీ 100 వెంట్రుకలు రాలిపోతాయి. ఇది కొంత మందిలో వంశ పారంపర్యంగా వచ్చే సమస్య. పెద్దవాళ్లకు బట్టతల ఉంటే, వారి పిల్లలకు కూడా అది వచ్చే అవకాశాలుంటాయి. మరి దీనినుండి తప్పించుకునే అవకాశం లేదా అంటే ఉంది. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టొచ్చు.
undefined
బట్టతల, పలుచటి మాడు జుట్టు ఊడిపోవడానికి సంకేతాలు. ఇవి ఇంకా ఎక్కువైతే చిన్న వయసులోనే ముసలివారిగా కనబడతారు. ఎన్నిరకాల షాంపూలు, నూనెలు, హెయిర్ ట్రీట్మెంట్లు తీసుకున్నా ప్రయోజనం ఉండదు.
undefined
జుట్టు రాలడాన్ని నివారించడంలో విటమిన్ ఈ బాగా పనిచేస్తుంది. అందుకే విటమిన్ ఇ ఎక్కువగా ఉండే నువ్వులనూనెను తలకు బాగా పట్టించాలి. కాసేపటి తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే క్రమంగా జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది.
undefined
ఉసిరికాయలు కూడా జుట్టురాలడాన్ని అరికట్టడంలో బాగా పనిచేస్తాయి. ఉసిరికాయ రసం తీసి తలకి రాస్తే వెంట్రుకలు ఊడడం తగ్గి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
undefined
కొబ్బరినూనె లేక నువ్వుల నూనెలో మందార పువ్వులను వేసి కాచి, ఆ నూనెను జుట్టుకు పెట్టుకోవాలి. ఒక గంట తర్వాత కుంకుడు రసంతో స్నానం చేస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.
undefined
మందార పువ్వులే కాదు ఆకులు కూడా జుట్టు రాలకుండా అరికడతాయి. మందార ఆకులను మెత్తగా నూరి, తలకు బాగా పట్టించి కాసేపటి తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఊడదు.
undefined
చేమ దుంపల రసం కూడా జుట్టు రాలడాన్ని అరికడుతుంది. చేమదుంపల రసం తీసి తలకు రాస్తే జుట్టు ఊడటం ఆగిపోతుంది.
undefined
దోస గింజలు ఎండబెట్టి, దంచి, నూనె తీసి, దాన్ని నిమ్మరసంతో కలిపి తలకు రాస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.
undefined
నాలుగు టీ స్పూన్ల కొబ్బరి పాలలో, ఒక స్పూను నిమ్మరసం కలిపి, తలకు బాగా పట్టించాలి. బాగా ఆరిన తరువాత తలస్నానం చేస్తే జుట్టు రాలదు.
undefined
click me!