కొత్త చీపురు వాడుతున్నారా.. ఇల్లంతా పొట్టు, దుమ్ము రాకుండా ఉండాలంటే ఇలా చేయండి

Published : Nov 03, 2026, 04:48 PM IST

Home Cleaning Tips: ఇంటిని శుభ్రం చేసేందుకు కొత్త చీపురు కొనుగోలు చేస్తుంటాం. అయితే దాన్ని మొదటిసారి ఉపయోగించినప్పుడు చిన్న చిన్న పొట్టులు, గడ్డి ముక్కలు రాలిపడి ఇల్లంతా చెత్తగా మారుతుంటుంది. కొన్ని చిట్కాల‌తో ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టొచ్చు

PREV
15
ముందుగా బయట శుభ్రం చేసుకోవాలి

కొత్త చీపురు కొనుగోలు చేసిన వెంటనే ఇంట్లో ఉప‌యోగించ‌కూడ‌దు. ముందుగా దాన్ని ఇంటి బయటకు తీసుకెళ్లి ఒకసారి బాగా విదిలించాలి. చీపురు కట్టలో ఇరుక్కున్న చిన్న చిన్న గడ్డి ముక్కలు, పొట్టు ఇలా చేయడం వల్ల కింద పడిపోతాయి. ఆ తర్వాత చేతులతో మెల్లగా సర్దుకుంటే వదులుగా ఉన్న భాగాలు తొలగిపోతాయి. అయితే చీపురును గోడకు లేదా నేలకు గట్టిగా కొట్టకూడదు. అలా చేస్తే దాని పుల్లలు విరిగిపోవడంతో పాటు కట్ట కూడా వదులయ్యే అవకాశం ఉంటుంది.

25
నీటితో శుభ్రం చేసే పద్ధతి

కొత్త చీపురులోని పొట్టును తొలగించడానికి నీటిని కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఒక బకెట్‌లో నీళ్లు తీసుకుని చీపురు చివరి భాగాన్ని అందులో ముంచాలి. కొన్ని నిమిషాల పాటు ఉంచిన తర్వాత బయటకు తీసి మెల్లగా విదిలించాలి. నీటిని మార్చి మరోసారి ఇదే విధంగా చేయవచ్చు. తర్వాత చీపురును ఎండలో పూర్తిగా ఆరబెట్టాలి. తడి చీపురుతో ఇల్లు ఊడిస్తే దుమ్ము, వెంట్రుకలు అంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా ఆరిన తర్వాతే ఉపయోగించాలి.

35
దువ్వెనతో పొట్టు తొలగించవచ్చు

కొత్త చీపురును శుభ్రం చేయడానికి పాత దువ్వెన లేదా బట్టలు ఉతికే బ్రష్ ఉపయోగపడుతుంది. చీపురులోని పుల్లలను ఒకే దిశలో మెల్లగా దువ్వాలి. ఇలా మూడు నాలుగు సార్లు చేస్తే వదులుగా ఉన్న పొట్టు, చిన్న గడ్డి ముక్కలు బయటకు వస్తాయి. ఆ తర్వాత చీపురును బయటకు తీసుకెళ్లి మెల్లగా విదిలించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో చెత్త పడకుండా ముందుగానే పొట్టును తొలగించుకోవచ్చు. అయితే మరీ గట్టిగా దువ్వకుండా జాగ్రత్త పడాలి.

45
కొబ్బరినూనెతో ఈ చిట్కా ప్రయత్నించండి

కొంతమంది కొత్త చీపురు పుల్లలు మరీ పొడిగా ఉండటం వల్ల చిన్న చిన్న ముక్కలు రాలుతుంటాయి. ఇలాంటి సమయంలో కొబ్బరినూనె చిట్కాను ప్రయత్నించవచ్చు. కొద్దిగా కొబ్బరినూనెను చీపురు పుల్లలపై రాసి చేతులతో మెల్లగా రుద్దాలి. అనంతరం దువ్వెనతో దువ్వి, బయట విదిలించాలి. అయితే నూనె ఎక్కువగా ఉపయోగించకూడదు. పుల్లలకు నూనె అంటుకుంటే దుమ్ము, ధూళి మరింతగా పేరుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఈ పద్ధతిని ఉపయోగించినప్పుడు చాలా తక్కువ మోతాదులోనే నూనె తీసుకోవాలి.

55
ఫేస్ పౌడర్‌తోనూ ప్రయత్నించవచ్చు

కొత్త చీపురులోని వదులుగా ఉన్న పొట్టును తొలగించడానికి ఫేస్ పౌడర్ ఉపయోగించే చిట్కా కూడా ఉంది. ముందుగా చీపురు పుల్లలపై కొద్దిగా పౌడర్ చల్లి, దువ్వెనతో మెల్లగా దువ్వాలి. ఆ తర్వాత బయటకు తీసుకెళ్లి విదిలిస్తే వదులుగా ఉన్న పొట్టు కింద పడుతుంది. అయితే పౌడర్ ఎక్కువగా చల్లకూడదు. చీపురును ఉపయోగించే ముందు దానిపై పౌడర్ మిగలకుండా పూర్తిగా విదిలించాలి. వీటిలో అన్నింటికంటే ముఖ్యంగా కొత్త చీపురును మొదటిసారి ఇంట్లో ఉపయోగించే ముందే బయట శుభ్రం చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే ఇల్లు ఊడ్చిన ప్రతిసారీ పొట్టు పేరుకుపోయే ఇబ్బంది తగ్గుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories