
మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వేడి చేసుకుంటాం కాబట్టి దాని లోపల శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. మార్కెట్లో లభించే కొన్ని క్లీనింగ్ స్ప్రేల్లో ఘాటైన సువాసనలు, రసాయన పదార్థాలు ఉంటాయి. వాటిని ఉపయోగించిన తర్వాత సరిగ్గా తుడవకపోతే కెమికల్స్ ఉండిపోతాయి. అందుకే నిమ్మకాయ, వెనిగర్, బేకింగ్ సోడాతో శుభ్రం చేసుకోవచ్చు. జిడ్డును పొగొట్టి సులభంగా తొలగించుకోవచ్చు.
మైక్రోవేవ్‌లో పేరుకుపోయిన జిడ్డు మరకలు, వాసనలను తొలగించడానికి నిమ్మకాయ చక్కగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్లు తీసుకోవాలి. అందులో ఒక నిమ్మకాయను సగానికి కోసి రసం పిండాలి. ఆ ముక్కలను కూడా అదే నీటిలో వేయాలి.
ఇప్పుడు ఆ గిన్నెను మైక్రోవేవ్‌లో పెట్టి సుమారు 3-4 నిమిషాల పాటు వేడి చేయాలి. నీళ్లు మరిగి ఆవిరి వచ్చిన తర్వాత వెంటనే తలుపు తెరవకుండా మరో ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి. దీంతో లోపల పేరుకుపోయిన ఆహారపు మరకలు, జిడ్డు మెత్తబడతాయి. ఆ తర్వాత జాగ్రత్తగా గిన్నెను బయటకు తీసి, తడి మైక్రోఫైబర్ క్లాత్‌తో లోపల, పైభాగం, టర్న్ టేబుల్‌ను తుడవాలి. మరకలు సులభంగా తొలగిపోవడంతో పాటు నిమ్మకాయ సువాసన కూడా వస్తుంది.
నిమ్మకాయ, వెనిగర్ వంటివి ఇంట్లో లేకపోయినా మైక్రోవేవ్‌ను శుభ్రం చేసుకోవచ్చు. ఇందుకోసం శుభ్రమైన కిచెన్ టవల్ లేదా మైక్రోవేవ్‌లో ఉపయోగించడానికి అనువైన క్లాత్‌ను నీటితో పూర్తిగా తడపాలి. అదనపు నీటిని పిండి, ఆ క్లాత్‌ను టర్న్ టేబుల్‌పై ఉంచాలి.
ఇప్పుడు మైక్రోవేవ్‌ను రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేడి చేయాలి. క్లాత్‌లోని నీరు వేడెక్కి ఆవిరిగా మారుతుంది. ఆ ఆవిరి లోపలి గోడలకు అంటుకున్న మరకలను మెత్తబరుస్తుంది. వేడి తగ్గిన తర్వాత జాగ్రత్తగా ఆ క్లాత్‌ను తీసి, దానితోనే లోపలి భాగాన్ని తుడవొచ్చు. తలుపు అంచులు, హ్యాండిల్స్‌ను కూడా శుభ్రం చేసుకోవచ్చు. అయితే క్లాత్‌ను ఎప్పుడూ పూర్తిగా తడిగా ఉంచాలి. పొడి బట్టను మైక్రోవేవ్‌లో వేడి చేయకూడదు. ఈ పద్ధతిలోనూ వేడెక్కిన క్లాత్‌ను వెంటనే చేతులతో పట్టుకోకూడదు.
మైక్రోవేవ్‌లో ఆహారం కాలిపోయి గట్టిగా అంటుకుపోయిన మరకలు ఉంటే బేకింగ్ సోడా ఉపయోగించవచ్చు. ఇది తేలికపాటి రాపిడి గుణాలు కలిగి ఉండటంతో మొండి మరకలను తొలగించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్లు కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి.
ఈ పేస్ట్‌ను మరకలు ఉన్న ప్రాంతంలో రాసి సుమారు 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తడి క్లాత్‌తో మెల్లగా తుడవాలి. దీంతో గట్టిగా పేరుకుపోయిన ఆహారపు మరకలు కూడా తొలగిపోతాయి. చివరగా శుభ్రమైన తడి క్లాత్‌తో మరోసారి తుడిచి బేకింగ్ సోడా అవశేషాలు లేకుండా చూసుకోవాలి. మైక్రోవేవ్ లోపలి రక్షణ పూత దెబ్బతినకుండా గట్టిగా రుద్దకూడదు.
మైక్రోవేవ్‌లో పేరుకుపోయిన జిడ్డు మరకలు, వాసనలను తొలగించడానికి నిమ్మకాయ చక్కగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్లు తీసుకోవాలి. అందులో ఒక నిమ్మకాయను సగానికి కోసి రసం పిండాలి. ఆ ముక్కలను కూడా అదే నీటిలో వేయాలి.
ఇప్పుడు ఆ గిన్నెను మైక్రోవేవ్‌లో పెట్టి సుమారు 3-4 నిమిషాల పాటు వేడి చేయాలి. నీళ్లు మరిగి ఆవిరి వచ్చిన తర్వాత వెంటనే తలుపు తెరవకుండా మరో ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి. దీంతో లోపల పేరుకుపోయిన ఆహారపు మరకలు, జిడ్డు మెత్తబడతాయి. ఆ తర్వాత జాగ్రత్తగా గిన్నెను బయటకు తీసి, తడి మైక్రోఫైబర్ క్లాత్‌తో లోపల, పైభాగం, టర్న్ టేబుల్‌ను తుడవాలి. మరకలు సులభంగా తొలగిపోవడంతో పాటు నిమ్మకాయ సువాసన కూడా వస్తుంది.
కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి!
శుభ్రం చేసే ముందు మైక్రోవేవ్‌ను ఆఫ్ చేసి, అవసరమైతే విద్యుత్ కనెక్షన్ తొలగించాలి. ఆవిరి పట్టించిన వెంటనే తలుపు తెరిచేటప్పుడు ముఖాన్ని దగ్గరగా పెట్టకూడదు. వేడి ఆవిరి వల్ల కాలే ప్రమాదం ఉంటుంది. నీటిని వేడి చేయడానికి మైక్రోవేవ్ సేఫ్ గిన్నెలనే ఉపయోగించాలి. బేకింగ్ సోడా పేస్ట్‌ను వెంటిలేషన్ రంధ్రాలు, ఎలక్ట్రికల్ భాగాలపై రాయకూడదు. బ్లీచ్, ఇతర క్లీనర్లు, వెనిగర్ వంటి పదార్థాలను కలిపి ఉపయోగించకూడదు. మైక్రోవేవ్‌ను శుభ్రం చేయడానికి ప్రతిసారీ ఖరీదైన క్లీనింగ్ ఉత్పత్తులే అవసరం లేదు. నిమ్మకాయ, వెనిగర్, బేకింగ్ సోడా వంటి ఇంట్లో దొరికే వస్తువులతోనే సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆహారపు మరకలు ఎక్కువగా పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉంటే మైక్రోవేవ్ ఎక్కువ కాలం శుభ్రంగా ఉంటుంది.