ఇలా చేస్తే కొలెస్ట్రాల్ చాలా ఫాస్ట్ గా తగ్గుతుంది..

First Published Oct 21, 2022, 11:58 AM IST

నిజానికి కొలెస్ట్రాల్ మన గుండెకు చాలా మంచిది. కానీ తక్కువ పరిమాణంలో ఉండాలి. అదే శరీరంలో కొలెస్ట్రాల్ విచ్చల విడిగా పెరిగిపోతే మాత్రం గుండెపోటు నుంచి ఎన్నో డేంజర్ జబ్బులొచ్చే అవకాశం ఉంది. 

High Cholesterol

మన గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే.. మన రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా తక్కువగా ఉండాలి. అంటే ఎల్డిఎల్ 100 కంటే తక్కువగా ఉండాలి. 130 కంటే ఎక్కువ ఉంటే.. శరీరంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నట్టే. ఇది గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. అధిక కొలెస్ట్రాల్ కొరోనరీ ధమనులను దెబ్బతీస్తుంది. అయితే మన లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులను చేసుకుంటే సులువుగా కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. అవేంటంటే.. 

fiber

ఫైబర్ : మీరు తినే ఆహారాల్లో కరిగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. కరిగే ఫైబర్ ఉన్నవాటిని తినడం వల్ల రక్తప్రవాహంలోకి దాని శోషణను తగ్గిస్తుంది. దీంతో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇందుకోసం ఓట్ మీల్, పియర్స్, బీన్స్ వంటి వాటిని తినండి. వీటిలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 

ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు: కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలను ఎక్కువగా తినండి. ఎందుకంటే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ ను చాలా వరకు తగ్గిస్తాయి. ఇవి మీ గుండెకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. గుండె పోటు, స్ట్రోక్ వంటి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 

వ్యాయామం:  శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగితే.. ఆటోమెటిక్ గా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అందుకే మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయండి. ఇది గుండెను గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది. ఇది బరువును కూడా తగ్గిస్తుంది. 

ఎక్కువగా తాగకూడదు: మధ్యపానం, ధూమపానం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ధూమపానం ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. గుండెను కూడా రిస్క్ లో పడేస్తుంది. ముఖ్యంగా స్మోకింగ్ మానేయడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో కొరోనరీ ధమనులు ఆరోగ్యంగా ఉంటాయి. ఆల్కహాల్ ను కూడా మోతాదులోనే తాగాలి. ఎందుకంటే ఇది కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.            
 

ప్రాసెస్ చేసిన ఆహారాలు:  ప్రాసెస్ చేసిన మాంసాహారం, ఇతర ఆహారాల్లో సోడియం,  సంతృప్త కొవ్వులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. న్యూట్రిషన్, మెటబాలిజం & వార్డియోవాస్కులర్ డిసీజెస్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. క్రమం తప్పకుండా ప్రాసెస్ చేసిన ఆహారాలను తినడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరుగుతాయి. వీటికి బదులుగా ఫ్రెష్ ఆహారాలనే ఎక్కువగా తినాలి. 

click me!