చలికాలంలో వీటిని తింటే మీ పొట్ట ఇట్టే కరిగిపోతుంది..

First Published Dec 19, 2022, 10:50 AM IST

పొట్టచుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడం అంత సులవు కాదు. ఏం చేసినా కానీ ఈ కొవ్వు అలాగే ఉంటుంది. అయితే చలికాలంలో కొన్ని ఆహారాలను తింటే మాత్రం బెల్లీ ఫ్యాట్ ఉందన్న ముచ్చటే ఉండదు. 

చలికాలంలో వేడి వేడి.. నాలుకకు రుచిగా అనిపించే ఆహారాలనే తినాలనిపిస్తుంది. అవి అసలు ఆరోగ్యానికి మంచివా? చెడ్డవా? అన్న సంగతిని మర్చిపోయి వాటినే లాగించేస్తుంటాం. ముఖ్యంగా ఆయిలీ ఫుడ్స్. ఇలాంటి ఆహారాలు టేస్టీగానే ఉంటాయి. కానీ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఇవి ఎన్నో రోగాలకు దారితీయడమే కాకుండా శరీర  బరువును.. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ ను బాగా పెంచుతాయి. ఇక ఈ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి ఉంటది. కానీ ఇందుకు టైం లేనివారు కూడా ఉన్నారు. అయితే ఈ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి చలికాలంలో కొన్ని ఆహారాలను తింటే సరి. మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు ఇట్టే కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

క్యారెట్

చలికాలంలో క్యారెట్లకు ఎలాంటి కొదవా ఉండదు. మార్కెట్ లో ఇవి చాలా చవకగా లభిస్తాయి కూడా.  క్యారెట్లు కొంచెం తియ్యగా ఉంటాయి. కానీ వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కార్భోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గేందుకు, బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకునేందుకు ఇవి బెస్ట్ ఫుడ్. రోజూ కొద్ది మొత్తంలో వీటిని తింటే బరువు పెరిగే సమస్యే ఉండదు. అలా అని ఎక్కువగా తినేస్తే మాత్రం మీ చర్మ రంగు మారుతుంది జాగ్రత్త.. 

వింటర్ గ్రీన్స్

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉండే  ఆకుకూరలను ఈ సీజన్ లో ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటుగా.. జీవక్రియను కూడా పెంచుతాయి. ఇందుకోసం ఫైబర్ పుష్కలంగా ఉండే బచ్చలికూర, మెంతి ఆకులు, ఆవాల ఆకులు వంటి కూరగాయలను ఎక్కువగా తినాలి. ఈ ఆహారాలు మీరు వేగంగా బరువు తగ్గేందుకు సహాయపడతాయి. నిజానికి వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. 
 

ముల్లంగి

చలికాలంలో ముల్లంగిని తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇది హై బీపీని తగ్గిస్తుంది. షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. నిజానికి ముల్లంగిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ కూరగాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఈ ఫైబర్ జీర్ణక్రియ పనితీరును మెరుగుతుపరుస్తుంది. బెల్లీ ఫ్యాట్ ను తగ్గిస్తుంది. అందుకే వీటిని ఈ సీజన్ లో తప్పకుండా తినండి.
 

బీట్ రూట్

యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యుఎస్డిఎ) ప్రకారం.. 100 గ్రాముల బీట్ రూట్ లో కేవలం 43 కేలరీలు, 0.2 గ్రాముల కొవ్వు, 10 గ్రాముల కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. అందుకే బీట్ రూట్ బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని అంటుంటారు. నిజానికి బీట్ రూట్ వెయిట్ లాస్ కే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది కూడా. ఖచ్చితంగా బరువు తగ్గాలనుకుంటే  ఈ బీట్రూట్ వంటకాలను ఖచ్చితంగా తీసుకోండి. 
 

జామకాయ

మీకు తెలుసా? జామకాయలలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీనిద్వారా మీ రోజు వారి ఫైబర్ అవసరాల్లో 12 శాతం అందిస్తుంది. శీతాకాలంలో జామ పండ్లకు ఎలాంటి కొదవా ఉండదు. కానీ చాలా మంది జలుబు చేస్తుందని జామపండ్లకు దూరంగా ఉంటారు. రోజూ ఒకటి రెండు జామ పండ్లను తింటే ఎలాంటి సమస్యలూ రావు. నిజానికి జామ మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుపర్చడానికి కూడా సహాయపడుతుంది. 
 

ఈ ఆహారాల్లో తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ లు ఉంటాయి. ఇలాంటి ఆహారాలు జీర్ణక్రియ, జీవక్రియలకు ఎంతో సహాయపడతాయి. వీటిని మీ శీతాకాలపు ఆహారంలో తప్పకుండా చేర్చండి. అలాగే బెల్లీ ఫ్యాట్ కు గుడ్ బాయ్ చెప్పండి.

click me!