ఇందుకే ఆకలి వేయదంట..

First Published Sep 8, 2022, 12:35 PM IST

ఒత్తిడి, ఆందోళన, గర్భం దాల్చడం, నిరాశ వంటి ఎన్నో కారణాల వల్ల కూడా ఆకలి వేయదని ఆరోగ్య నిపుణులు  చెబుతున్నారు. 
 

శరీరమనే బండికి ఆహారమే ఇందనం. ఆహారాన్ని సరిగ్గా తీసుకోకపోతే శరీరం సక్రమంగా పనిచేయదు. ముఖ్యంగా దీనివల్ల శరీరం ప్రమాదంలో పడుతుంది. అంటే ఎన్నో జబ్బులు సోకుతాయన్న మాట. అయితే కొంతమంది ఫుడ్ ను మోతాదులో తింటే.. మరికొంతమంది మాత్రం అతిగా తింటూ తిప్పలు పడతారు. ఈ సంగతి పక్కన పెడితే అందరికీ ఏదో ఒక సందర్భంలో ఆకలి వేయదు. కానీ మరికొంతమందికి మాత్రం రోజుల తరబడి ఆకలిగా అనిపించదు. ఇలాంటి వారు ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి.

దీర్ఘకాలిక నొప్పి, ఒత్తిడి ఎక్కువ అవడం, ఆందోళన వంటి అనారోగ్య సమస్యలు ఆకలి వేయకపోవడానికి కారణాలు. ఆకలి వేయడం లేదని తినడం మానేస్తే శరీరం బలహీనపడుతుంది. ఇది మిమ్మల్ని మరింత ప్రమాదంలో పడేస్తుంది. నిపుణులు అభిప్రాయం ప్రకారం.. ఆకలి లేకపోవడానికి కారణాలేంటో తెలుసుకుందాం పదండి.. 

ఆందోళన

మీరు ఆందోళనలో ఉంటే కేంద్ర నాడీ వ్యవస్థ ఒత్తిడిని కలిగించే హార్మోన్లను విడదల చేస్తుంది. ఈ అవాంఛిత ఒత్తిడి హార్మోన్లు మీకు ఆకలి లేకుండా చేయడంతో పాటుగా.. ఎన్నో రకాలుగా మీ శరీరంపై చెడు ప్రభావాన్నిచూపెడుతాయి. 
 

డిప్రెషన్

ఆకలి తగ్గడానికి డిప్రెషన్ కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు. మానసిక ఆరోగ్య సమస్య అయిన డిప్రెషన్ కార్టికోట్రోపిన్ ను విడుదల చేయడానికి సహాయపడుతుంది. దీంతో మీకు ఆకలి అనిపించదు. 
 

ఒత్తిడి

ఒత్తిడి కూడా ఆకలిని తగ్గిస్తుంది. అజీర్థి, వికారం వంటి లక్షణాలు దీనిలో కనిపిస్తాయి. వీటివల్ల తినాలనే కోరికలు తగ్గుతాయి. ఆహారం చూసినా.. వికారంగా అనిపిస్తుంది. 
 

అస్వస్థత

శరీరం ఆరోగ్యంగా లేకుంటే కూడా తినాలన్న కోరిక మొత్తమే తగ్గుతుందన్న సంగతి అందరికీ తెలుసు. అనారోగ్యంతో ఉన్నప్పుడు రోగ నిరోధక వ్యవస్థ అనారోగ్యం నుంచి బయటపడేసేందుకు ఎక్కువగా పనిచేస్తుంది. దీనివల్ల సైటోకైన్స్ అనే రసాయనాలు విడుదల అవుతాయి. దీనివల్ల మీరు చాలా అసిపోతారు. దీంతో మీకు ఏదీ తినాలనిపించదు. 
 

pregnant

గర్భం దాల్చడం

గర్భధారణ సమయంలో ఆడవారి శరీరంలో ఎన్నో రకాల మార్పులు వస్తాయి. ఇలాంటి పరిస్థితిలో ఆకలి తగ్గడం, ఆకలి లేకపోవడం, ఆహారంపై విరక్తి కలుగుతాయి. గుండెల్లో మంట, వికారం వంటివి గర్భధారణ లక్షణాలు. గర్భం దాల్చినవారికి కొన్ని రకాల ఆహారాలను చూస్తే వికారంగా అనిపిస్తుంది. ఇది వారి ఆకలిని పోగొడుతుంది. 
 

దీర్ఘకాలిక నొప్పి

దీర్ఘకాలిక నొప్పి కూడా ఆకలిని తగ్గిస్తుంది. ఈ నొప్పి శరీరాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఇవి శరీరక, మానసిక ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావాలను చూపెడుతుంది. అలాగే ఆకలిని కూడా తగ్గిస్తుంది. 
 

మందులు

కొన్ని కొన్ని సార్లు మందులు కూడా మన శరీరంపై దుష్ఫ్రభావాలను చూపెడుతాయి. కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల ఆహారాన్ని తినాలన్న కోరిక తగ్గుతుంది.
 

వయస్సు

చిన్న వయసులో ఉన్నంత హుషారుగా, శక్తివంతంగా పెద్దయ్యాక ఉండరు. అలాగే వయస్సుతో పాటేగా ఒక వ్యక్తికి ఆకలి కోరికలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే వయసు మీద పడుతున్న కొద్దీ జీర్ణక్రియ మందగిస్తుంది. దీంతో వీరికి పెద్దగా ఆకలి వేయదు. 
 

click me!