చలికాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఈ ఆహారాలను తప్పకుండా తినండి

First Published Jan 17, 2023, 12:11 PM IST

చలికాలంలో ఎన్నో రోగాలు వస్తుంటాయి. దీనివల్ల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. అయితే ఈ సీజన్ లో కొన్ని రకాల  ఆహారాలను తింటే రోగాలొచ్చే ప్రమాదం తగ్గుతుంది. 
 

వాతావరణం రోజురోజుకూ మరీ చల్లగా మారుతోంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తూ.. కొన్ని సీజనల్ ఫుడ్స్ ను మీ ఆహారంలో చేర్చుకుంటే మా ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఇవి మిమ్మల్ని ఎన్నో రకాల అనారోగ్యాల నుంచి రక్షిస్తాయి. ఇంతకీ ఈ సీజన్ లో ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

సుగంధ ద్రవ్యాలు

చలికాలంలో సుగంధ ద్రవ్యాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.  చలికాలంలో దగ్గు, ఫ్లూను ఆవాలు, అజ్వైన్ విత్తనాలు సమర్థవంతంగా తగ్గిస్తాయి. ఇవి ఆకలి, జీర్ణవ్యవస్థను ప్రేరేపిస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. చలికాలంలో ఎక్కువగా వచ్చే ఎముకలు, కీళ్ల సమస్యలను తగ్గించడానికి మెంతులు బాగా సహాయపడతాయి. పసుపులో శక్తివంతమైన యాంటీ-మైక్రోబియల్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఈ మసాలా దినుసులను ఎక్కువగా చలికాలంలో తినాలని చెప్తుంటారు. 
 

బ్రోకలీ

బ్రోకలీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది ఆరోగ్యకరమైన, ఉపయోగకరమైన, ప్రసిద్ధ చలికాలపు కూరగాయ. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది వింటర్ ఫ్లూ నుంచి రక్షించడానికి సరైన ఆహారం. ఈ సీజన్ లో బ్రోకలీ బాగా లభిస్తాయి. అందుకే దీనిని సూప్ లో, వివిధ రకాల వంటలను తయారుచేసుకుని తినండి. ఇది శీతాకాలపు చలితో పోరాడటానికి సరైనది.
 

సిట్రస్ పండ్లు

నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో .. సిట్రస్ పండ్లలో విటమిన్ సి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బ్యాక్టీరియా, వైరల్ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. వీటిని అలాగే తిన్నా..  డెజర్ట్లు, సలాడ్లకు జోడించినా లేదా రసాలు, సాస్ లో వేసుకుని తీసుకోవచ్చు. 
 

Image: Getty Images

వెల్లుల్లి

చలికాలంలో వెల్లుల్లిని ఖచ్చితంగా తినాలంటారు ఆరోగ్య నిపుణులు. వెల్లుల్లి ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఈ వెల్లుల్లి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వెల్లుల్లిలో జెర్మేనియం, సెలీనియం వంటి మూలకాలతో పాటు అనేక ప్రయోజనకరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే వివిధ రకాల ఫ్లూ కలిగించే బ్యాక్టీరియా నుంచి మనల్ని రక్షిస్తాయి. 
 

Health Tips-patients should stay away from Pear fruit

పియర్స్

ఆరోగ్యకరమైన శీతాకాలపు పండ్లలో పియర్స్ ఒకటి. నిజానికి పియర్స్ సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటాయి. కానీ ఇవి శీతాకాలంలో చాలా రుచికరంగా ఉంటాయి.  ఎందుకంటే ఈ పండులో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె, రాగి, మెగ్నీషియం వంటి ఇతర పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి ఎన్నో గుండె రుగ్మతలను తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థకు సంబంధించిన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 
 

రూట్ కూరగాయలు

శీతాకాలంలో వెచ్చగా ఉండటానికి పోషకాలు అధికంగా ఉండే రూట్ కూరగాయలు చాలా చాలా అవసరం. మీరు తినగలిగే ఆరోగ్యకరమైన ఫుడ్స్ లో చిలగడదుంప ఒకటి. దీనిని శీతాకాలంలో తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. వీటిలో పొటాషియం, ఉప్పు, కాల్షియం, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. చిలగడదుంపలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. మంట తగ్గుతుంది. మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. 
 

విటమిన్-డి ఎక్కువగా ఉండే ఆహారాలు

చలికాలంలో  ఆరోగ్యంగా ఉండేందుకు గుడ్లను రోజూ తినండి. గుడ్లలో  విటమిన్ ఎ, విటమిన్ బి 12, విటమిన్ బి 6, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. దీనిలో కాల్షియం, ఇనుము, పొటాషియం, సెలీనియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి.  అలాగే ప్రోటీన్లు, ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలకు గుడ్లు మంచి మూలం. విటమిన్ డి మరొక అద్భుతమైన సహజ వనరు పుట్టగొడుగులు. శీతాకాలంలో వీటిని ఎక్కువ మోతాదులో తినడం మంచిది. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. 

click me!