తిన్నది అరగడం లేదా? అయితే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వండి సమస్య తగ్గుతుంది

First Published Jan 15, 2023, 3:58 PM IST

చలికాలంలో అజీర్థి సమస్య ఎక్కువవుతుంది. అయితే మీ ఆహారంలో, జీవన శైలిలో కొన్ని మార్పులను చేసుకుంటే ఫుడ్ సులువుగా జీర్ణం అవుతుంది. మలబద్దకం సమస్య కూడా ఉండదు.
 

ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడు గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, గుండెల్లో మంట లేదా విరేచనాలు వంటి జీర్ణ సమస్యలను ఫేస్ చేస్తుంటారు. కొందరికైతే కడుపునొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది. కడుపునకు సంబంధించిన సమస్యలు రావడం సర్వ సాధారణం. కానీ ఇవి ఎక్కువకాలం ఉండవు. కానీ చాలా మందికి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. మీ గట్ ఆరోగ్యం చర్మం, రోగనిరోధక వ్యవస్థ, నిద్ర చక్రం, గుండె, మెదడుతో పాటుగా శరీరంలోని ఎన్నో భాగాల్ని ప్రభావితం చేస్తుంది. అయితే జీర్ణక్రియను ఎలా మెరుగుపరచాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచేందుకు కార్బోహైడ్రేట్లు, అమైనో ఆమ్లాలు, లిపిడ్లు , ప్రోటీన్ వంటి పోషకాలు బాగా సహాయపడతాయి. ఈ పోషకాలు రక్తప్రవాహంలోకి మరింత గ్రహించబడతాయి. అక్కడ  ఇవి శక్తిగా మారతాయి. దీనిని మన శరీరం మరమ్మత్తు ఉపయోగించుకుంటుంది. అయినప్పటికీ.. మీ జీర్ణ ఆరోగ్యం సమతుల్యతలో లేకపోతే మీకు ఎన్నో సమస్యలు వస్తాయి. 
 

ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించండి

ఈ ఆహారాలు జీర్ణవ్యవస్థను మరింత కష్టపెడతాయి. జీవక్రియకు మన శరీరం దాని స్వంత పోషకాలను, శక్తిని సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ ప్రాసెస్ చేసిన ఆహారాలు శక్తి నిల్వలను తగ్గిస్తాయి. ముఖ్యంగా వీటిలో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడం కష్టతరం చేస్తుంది. ఎసిడిటీ వంటి గట్ సమస్యలను కలిగిస్తుంది. అందుకే ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండండి. వీటి బదులుగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినండి. ఇవి చాలా సులువుగా జీర్ణం అవుతాయి. 
 

fiber

ఎక్కువ ఫైబర్ ను తినండి

ఫైబర్ పెద్ద ప్రేగును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది మలాన్ని మృదువుగా చేస్తుంది. అలాగే పెద్దప్రేగు ద్వారా రవాణా సమయాన్ని వేగవంతం చేస్తుంది. ఏదైనా విష సమ్మేళనాల ప్రభావాలను కూడా పలుచగా చేస్తుంది. అలాగే చెడు బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది. వెజ్ జ్యూస్ లు, పండ్లు, సూప్ లు, సలాడ్లు, కూరగాయలు, తృణధాన్యాలతో కూడిన రోజులో 8 నుంచి 11 సేర్విన్గ్స్ ఫైబర్ తినాలని లక్ష్యంగా పెట్టుకోండి. ఫైబర్ బ్యాక్టీరియాను కూడా శుభ్రపరుస్తుంది.
 

కడుపు ఆమ్లాన్ని పెంచండి

తక్కువ కడుపు ఆమ్లం బెల్చింగ్, గ్యాస్, గుండెల్లో మంట, తలనొప్పి, అలసటకు దారితీస్తుంది. అందుకే ప్రతిరోజూ ఉదయం గ్లాస్ నీళ్లలో నిమ్మరసం, ఆపిల్ సైడర్ వెనిగర్ ను కలిపి తాగండి.  ఇవి ఆరోగ్యకరమైనవి. ఎలాంటి దుష్ప్ర ప్రభావాలను కలిగించవు. కానీ ఆపిల్ సైడర్ వెనిగర్ ను మాత్రం మితంగా తీసుకోవాలి. 
 

చేదు ఆహారాన్ని తినండి

డాండెలైన్ ఆకుకూరలు, డాండెలైన్ టీ, అరుగూలా, బచ్చలికూర, మెంతులు, పసుపు, కాలే వంటి చేదు ఆహారాల తీసుకోవడం పెంచండి. ఇవి ఆహారాన్ని మరింత సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయడానికి జీర్ణ ఎంజైమ్లు, పిత్తం ఉత్పత్తిని ప్రేరేపించడానికి ఈ ఆహారాలు సహాయపడతాయి. 

ప్రోబయోటిక్స్ జోడించండి

ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే, దీర్ఘకాలిక మంటను తగ్గించే, లీకైన గట్ ను పరిష్కరించడానికి సహాయపడే ప్రయోజనకరమైన బ్యాక్టీరియాతో లోడ్ చేయబడతాయి. కాబట్టి మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా, మీ కడుపును శుభ్రంగా ఉంచడానికి పులియబెట్టిన కూరగాయలు, కొబ్బరి కేఫీర్, ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ వంటి పులియబెట్టిన ఆహారాన్ని తీసుకోండి. 
 

chewing food

 ఆహారాన్ని బాగా నమలండి

ఆహారాన్ని వీలైనంత ఎక్కువ సేపు నమలాలి. దీనిద్వారా మీ ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. లాలాజలంలో జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కడుపులో మంటను తగ్గిస్తుంది. 
 

హైడ్రేట్ గా ఉండండి

ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి మీ పొత్తికడుపు అంతటా ఆరోగ్యకరమైన కండరాలు చాలా అవసరం. సరైన జీర్ణక్రియ కోసం చిన్న పేగు బ్యాక్టీరియాకు మద్దతునిచ్చే, మలబద్దకాన్ని నివారించడానికి సహాయపడే నీటిని తాగండి. రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగితే మలబద్దకం, అజీర్థి అనే సమస్యలే ఉండవు. 

click me!