రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఈ మూలికలు బెస్ట్..

First Published Dec 11, 2022, 12:03 PM IST

చలికాలంలో డయాబెటీస్ పేషెంట్లు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వేడివేడిగా తినాలనిపిస్తుందని ఏవి పడితే అవి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. 
 

Diabetes

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో డయాబెటీస్ ఒకటి. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ప్రకారం..  20 నుంచి 79 సంవత్సరాల మధ్య వయసున్న 537 మిలియన్ల మంది పెద్దలు ఈ వ్యాధి బారిన పడ్డారు. 2030 నాటికి మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య 543 మిలియనన్లకు, 2045 నాటికి 783 మిలియన్లకు పెరుగుతుందని డేటా పేర్కొంది. భారతదేశంలో కూడా మధుమేహుల సంఖ్య ఏడాదికేడాదికి పెరిగిపోతూనే ఉంది. ఏదేమైనా కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లతో టైప్ 2 డయాబెటీస్ కు దూరంగా ఉండొచ్చు. ఇక ఇప్పటికే దీనిబారిన పడిన వాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. 
 

diabetes

చలికాలంలో ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో. మధుమేహులు ఏవి పడితే అవి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. అందులోనూ ఈ సీజన్ లో చాలా మంది వ్యాయామం చేయరు. శారీరక శ్రమ తగ్గడంతో జీవక్రియ నెమ్మదిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయి మరింత ప్రభావితమవుతుంది. అయితే కొన్ని సహజ మూలికలు, సుగంధ ద్రవ్యాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ధనియాలు

ధనియాలు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి. అలాగే కార్భోహైడ్రేట్ జీవక్రియను మెరుగుపర్చడానికి, హైపోగ్లైసీమిక్ చర్యను పెంచడానికి సహాయపడుతుందని ఎన్నో అధ్యయనాలు కనుగొన్నాయి. ఈ ధనియాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా ఉండేందుకు సహాయపడతాయి.  ధనియాలు జీర్ణక్రియను కూడా పెరుగుపరుస్తాయి. అలాగే చక్కెర సరైన శోషణను ప్రోత్సహిస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గుతాయి. ఈ గింజల్లో ఇథనాల్ పుష్కలంగా ఉంటుంది. ఇది గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి సహాయడుతుంది. 
 


మెంతులు

ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ విటమిన్ అండ్ న్యూట్రిషన్ రీసెర్చ్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. వేడి నీళ్లలో నానబెట్టిన 10 గ్రాముల మెంతులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. ఈ మెంతుల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. కార్భోహైడ్రేట్లు, చక్కెర శోషణను ఫైబర్ మరింత నియంత్రిస్తుంది. 

మెంతులను ఎలా ఉపయోగించాలి: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిద్రపోయే ముందు లేదా ఉదయం మెంతులు నానబెట్టిన నీటిని తీసుకోవాలి. ఒకవేళ మీరు ఉదయం మెంతి వాటర్ ను తాగాలనుకుంటే పడుకునే ముందు ఈ గింజలను నానబెట్టండి. 
 

cinnamon

దాల్చిన చెక్క

డయాబెటీస్ కేర్ లో ప్రచురించిన పరిశోధనల ప్రకారం.. టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క పెరిగిన రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఇన్సులిన్-మైమెటిక్, ఇన్సులిన్ -సెన్సిటైజింగ్ చర్యను కలిగి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 

అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ మరొక అధ్యయనం ప్రకారం.. దాల్చిన చెక్కను సరైన మోతాదులో తీసుకుంటే.. రక్తంలో గ్లూకోజ్ 18 నుంచి 29 శాతం తగ్గుతుంది. టైప్ 2 డయాబెటీస్ తో సంబంధం ఉన్న అనారోగ్య నమస్యల ముప్పు కూడా తగ్గుతుంది. 

దాల్చిన చెక్కను ఎలా ఉపయోగించాలి:   ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దాల్చిన చెక్కను పాలలో కలిపి తీసుకోవాలి. ఇందుకోసం ఒక గ్లాస్ వేడి పాలలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని వేసి తాగాలి. 
 

పసుపు

పసుపులోని క్రియాశీల సమ్మేళనం కర్కుమిన్ శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. పసుపు ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడానికి, బరువు పెరగడాన్ని నివారించడానికి సహాయపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సీకరణ నష్టాన్ని కలిగించే ఫ్రీ రాడికల్స్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడతాయి.

పసుపును ఎలా ఉపయోగించాలి: ఒక గ్లాసు వేడి పాలలో అర టీస్పూన్ పసుపు పొడిని వేసి తీసుకోండి. ఇది మీ మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

కరివేపాకు 

కరివేపాకులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ ఎంతో సహాయపడుతుంది. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడానికి కూడా సహాయపడుతుంది.హెర్బ్ లో విటమిన్లు, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి టైప్ -2 డయాబెటిస్ తో సహా ఫ్రీ రాడికల్స్ నుంచి ఆక్సీకరణ నష్టంతో సంబంధం ఉన్న ఎన్నో రకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ డైఫార్మాజీలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. కరివేపాకులో యాంటీ హైపర్గ్లైసీమిక్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి శరీరంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి. 

కరివేపాకు ఎలా ఉపయోగించాలి: శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉదయం 8 నుంచి 10 తాజా కరివేపాకు ఆకులను పచ్చిగా తినాలి.

click me!