డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ప్రతి కలకూ ఏదో ఒక అర్థం అంటూ ఉంటుంది. కొన్ని కలలు పవిత్రమైనవిగా, మరికొన్ని కలలు అశుభమైనవిగా కూడా పరిగణించబడతాయి. ఒక వ్యక్తి భవిష్యత్తులో జరగబోయే సంఘటనల శుభ , అశుభ సంకేతాల గురించి కలలు మనకు చెప్తాయి. అయితే డ్రీమ్ సైన్స్ ప్రకారం.. కొన్ని కలలు ఒక వ్యక్తి అదృష్టాన్ని ప్రకాశింపజేస్తాయి. ఎలాంటి కలలు ఒక వ్యక్తి జీవితంలో శుభ ఫలితాలను ఇస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నీటి కలలు
మీరు మీ కలలో నది లేదా చెరువులో తేలియాడుతూ కనిపిస్తే మీకు అంతా మంచే జరుగుతుందని డ్రీమ్ సైన్స్ చెబుతోంది. ఈ కల మీకు సంపద, శ్రేయస్సు, విజయాన్ని పొందుతారనడాన్ని సూచిస్తుంది. వర్షపు నీరు తలపై పడటం కూడా శుభప్రదంగానే భావిస్తారు. ఇది లక్ష్మీదేవి అనుగ్రహం మీపై కురిపిస్తుందని చూపిస్తుంది. కలలో సముద్రాన్ని చూడటం అంటే మీకు త్వరలో సంపద కలగబోతుందని అర్థం వస్తుంది.
కలలో మామిడి పండ్లను చూస్తే..
డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మామిడి పండ్లను కలలో చూడటాన్ని కూడా శుభప్రదంగానే భావిస్తారు. అంటే మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొందరలో తొలగిపోతాయి. అలాగే మీకు అంతా మంచే జరుగుతుందని ఈ కల సంకేతం ఇస్తుంది. మీరు చాలా కాలంగా చేయడానికి ఇబ్బంది పడుతున్న పని త్వరలోనే పూర్తి కాబోతోందని కూడా ఈ కల అర్థం.
కలలో మతపరమైన ప్రయాణం
డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ఒక వ్యక్తి కలలో ధార్మిక ప్రయాణం చేస్తే సకల దేవతల ఆశీర్వాదం పొందుతారని అర్థం. అలాగే అదృష్టం కూడా వరిస్తుంది.
కలలో తామర పువ్వును చూడటం
కలల శాస్త్రం ప్రకారం.. కలలో తామర పువ్వు కనిపిస్తే దానిని శుభప్రదంగా భావిస్తారు. ఈ కల మీ జీవితంలో జరిగే అన్ని సమస్యలు త్వరలోనే అధిగమించబడతాయనడాన్ని సూచిస్తుంది. అలాగే మీరు ఆశించిన ఫలితాలను కూడా పొందుతారు. అంతే కాదు ఇలాంటి కలలు సంపద లాభాలను సూచిస్తాయి.
కలలో వేణువును చూడటం
కలలో వేణువు కనిపిస్తే లేదా దాని ట్యూన్ వింటే కూడా చాలా మంచిది. కలలో వేణువు వాయించడం చూస్తే అది శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. వేణువు శుభం, మాధుర్యానికి చిహ్నంగా భావిస్తారు. ఇలాంటి కల వస్తే మీ బంధం మధురంగా ఉంటుంది. అలాగే మీ జీవితంలోకి ఆనందం రాబోతుండటాన్ని సూచిస్తుంది.