చలికాలం స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.. సేఫ్ గా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించాల్సిందే..!

First Published Dec 29, 2022, 1:02 PM IST

చల్లని వాతావరణంలో రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీంతో స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీనినుంచి మీరు సేఫ్ గా ఉండాంటే కొన్ని చిట్కాలను తప్పకుండా పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటేంట.. 
 

stroke

ఇతర కాలాలతో పోల్చితే చలికాలంలోనే ఎన్నో రోగాలు వస్తుంటాయి. ఎందుకంటే చలికాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల మన ఆరోగ్యంపై, ముఖ్యంగా మన గుండెపై ఊహించని ప్రభావాలు పడతాయి. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక ప్రకారం.. ప్రపంచ వ్యాప్త మరణాలకు స్ట్రోక్ రెండవ ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 60 లక్షల మంది దీనితోనే  ప్రాణాలు కోల్పోతున్నారు. లాన్సెట్ అధ్యయనం ప్రకారం..  2019 లో భారతదేశంలో దాదాపుగా 7 లక్షల మంది స్ట్రోక్ తో చనిపోయారు. ఆ సంవత్సరం దేశంలో మొత్తం మరణాలలో 7.4% మంది స్ట్రోక్ తోనే చనిపోయారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. 

మెదడులోని రక్తనాళాలు చిట్లిపోవడం, మెదడుకు రక్త ప్రవాహం సరిగ్గా లేనప్పుడు స్ట్రోక్ వస్తుంది. దీనిని రక్తస్రావం స్ట్రోక్ అని కూడా అంటారు. ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత వాళ్లకు మళ్లీ మళ్లీ స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇది మీ ప్రాణాలను చాలా సులువుగా తీసేస్తుంది. అందుకే స్ట్రోక్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

stroke

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రక్తపోటును తగ్గించడానికి సహాయపడే మందులను క్రమం తప్పకుండా వేసుకోవాలి. అలాగే కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడే స్టాటిన్స్ అని పిలువబడే కొలెస్ట్రాల్ ను తగ్గించే మందులను మరుకువకుండా వేసుకోవాలి. ఆస్పిరిన్, రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే మందులు వంటి డాక్టర్ సూచించిన ఔషధాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల స్ట్రోక్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. 
 

stroke

మీ రక్తంలో చక్కెరను సాధారణ స్థితిలో ఉంచడానికి సహాయపడే కొన్ని మందులు స్ట్రోక్ నివారణకు కూడా చాలా సహాయపడతాయి.

రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ..  ధూమపానం మానేసి, పండ్లు,  కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే కొవ్వు తక్కువగా ఉన్న పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం వంటి అలవాట్ల వల్ల కూడా స్ట్రోక్ కు దూరంగా ఉండొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

stroke

డాక్టర్ సిఫారసు మేరకు ఉప్పును తీసుకోవాలి. అంటే రోజుకు 5 గ్రాములు లేదా రోజుకు ఒక టీస్పూన్ ను మాత్రమే తీసుకోవాలి. ఇంతకు తగ్గించినా స్ట్రోక్ ముప్పు తప్పుతుంది. 

ప్రతి ఒక గంట గంటకు 5 నుంచి 10 నిమిషాల పాటు శరీరాన్ని సాగదీయండి. అలాగే కొద్ది సేపు నడవండి. శరీర కదలికలు కూడా స్ట్రోక్ ముప్పును తప్పిస్తాయి. 

అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నట్టైతే మీరు మద్యపానాన్ని ఎక్కువగా తాగకూడదు. 

అలాగే సిగరెట్ లేదా బీడీ అంటే పొగాకును ఏ రూపంలోనూ తీసుకోకూడదు. ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 

click me!