దాహం తీరడం లేదని డైట్ సోడా తాగుతున్నారా? మీరెంత పెద్దతప్పు చేస్తున్నారో తెలుసా..? ఇది మీ ప్రాణాలను తీస్తుంది..

First Published Oct 17, 2022, 2:19 PM IST

ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదని డైట్ సోడాను ఎక్కువగా తాగుతుంటారు చాలా మంది. నిజానికి ఇది దాహాన్ని తీర్చినా.. ఎన్నో రోగాలకు దారితీస్తుంది. 
 

ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన వాటినే తినాలి. ముఖ్యంగా కూరగాయలు, పండ్ల రసాలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటి వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాదు.. బరువు కూడా తగ్గుతారు. కానీ చాలా మంది ఇవి రుచిగా ఉండవని మార్కెట్లో దొరికే శీతల పానీయాలనే ఎక్కువగా తాగుతుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు.  వీటిని తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటంటే.. 

శాన్ ఆంటోనియోలోని టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్ లోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన రెండు అధ్యయనాల (2011, 2015 ) ప్రకారం.. డైట్ కోక్ నడుమును మూడు అంగుళాల కంటే ఎక్కువ పెంచుతుందని కనుగొన్నారు. దీని అర్థం ఇది ఊబకాయం పెరగడానికి దారితీసింది.
 

అంతే కాదు డైట్ డ్రింక్ తీసుకున్న వారి నడుము పరిమాణం.. అది తీసుకోని వారి కంటే 70 శాతం ఎక్కువగా ఉంది. కాగా డైట్ కూల్ డ్రింక్ తీసుకోని వారితో పోలిస్తే రోజుకు 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు దీనిని తీసుకున్న వారిలో 500% హిప్ పెరుగుదల ఉంటుందట. దీనికి కారణం వీటిలో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉండటం. దీన్ని ఒకసారి తాగితే మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తుంది. ఇలా తాగితే శరీరంలో కేలరీలు విపరీతంగా పెరిగిపోతాయి. 

మెటబాలిక్ సిండ్రోమ్ , డయాబెటిస్ ప్రమాదం

పలు అధ్యయనాల ప్రకారం..  డైట్ కూల్ డ్రింక్స్ మెటబాలిక్ సిండ్రోమ్, డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది బెల్లీ ఫ్యాట్, అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, మధుమేహంతో సంబంధం ఉన్న అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచే ప్రమాద కారకాల సమూహం.
 

2008 లో.. మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో సుమారు 10,000 మంది పెద్దలపై ఒక అధ్యయనం నిర్వహించారు. మరొక అధ్యయనంలో.. డైట్ సోడా తాగడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదం 36% , టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని 67% పెరిగినట్టు కనుగొన్నారు. 
 

స్వీడన్ లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ చేసిన పరిశోధన ప్రకారం.. 2 లేదా అంతకంటే ఎక్కువ Servings Diet సోడా లేదా పానీయం తాగిన పురుషులకు గుండె ఆగిపోయే ప్రమాదం 23% ఎక్కువగా ఉంటుందట. ఈ అధ్యయనంలో 42,400 మంది పురుషులు పాల్గొన్నారు. వీళ్లను 12 సంవత్సరాల కాలం పాటు పరిశీలించారు. వీరిలో 3604 మంది గుండె ఆగిపోవడం, 509 మంది చనిపోయారు. 

2009 లో 3000 మందికి పైగా మహిళలపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. డైట్ సోడా మూత్రపిండాల సమస్యలను పెంచుతుంది. అధిక సోడియం, కృత్రిమ స్వీటెనర్ తీసుకోవడం వల్ల మూత్రపిండాల పనితీరు తగ్గుతుందని ఇప్పటి వరకు చేసిన అధ్యయనాల్లో వెల్లడైందని నిపుణులు చెబుతున్నారు.

డిప్రెషన్ ను పెంచవచ్చు

డైట్ కోక్ లో అస్పర్టమేస్ లేదా స్వీటెనర్ లు ఉంటాయి. ఇవి ప్రమాదకరమైన రసాయనాలు. కృత్రిమంగా తియ్యటి పానీయాలు డిప్రెషన్ ను పెంచుతాయని అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ కనుగొంది. తియ్యటి పానీయాలు, కాఫీ, టీలను సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తారు. ఇవి పెద్దగా నష్టాన్ని కలిగించవు. కానీ డైట్ కూల్ డ్రింక్ లేదా డైట్ సోడా తీసుకునే వ్యక్తులు నిరాశకు ఎక్కువగా గురవుతారు.
 

click me!