Health Tips: బంగాళాదుంప రసాన్ని తాగకపోతే మీరు ఈ బెనిఫిట్స్ అన్నింటినీ మిస్ అయిపోతారు..!

First Published Aug 16, 2022, 2:56 PM IST

Health Tips: బంగాళాదుంప రసం మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. దీన్ని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.
 

బంగాళా దుంపలతో ఎన్నో రకాల వంటలను చేసుకుని తినొచ్చు. బంగాళాదుంప పకోడీలు, బంగాళదుంప ఫ్రెంచ్ ఫ్రైస్, బంగాళాదుంప పరాఠాలు మొదలైన వంటకాలు ఎంతో టేస్టీగా ఉంటాయి. అందుకే చాలా మందికి బంగాళాదుంపలతో చేసిన వంటకాలను ఇష్టంగా లాగిస్తుంటారు. అయితే కొంతమంది బంగాళాదుంపలను తింటే ఒంట్లో కొవ్వు పెరుగుతుందని వీటిని పక్కన పెట్టేస్తుంటారు. కానీ ఇందులో నిజం లేదంటున్నారు నిపుణులు. 

బంగాళదుంపలు మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో ఐరన్, క్యాల్షియం, విటమిన్ బి, ఫాస్పరస్ వంటి ఎన్నో పోషకాలుంటాయి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల ఎన్నో లాభాలను పొందుతారు. బంగాళదుంపలు మీ ఆరోగ్యానికి ఎంత మంచివో చర్మానికి కూడా అంతే మంచిది. అంతేకాదు బంగాళాదుంప రసం  ప్రయోజనాలు, బంగాళాదుంపలతో చేసిన వంటకాల కంటే ఎక్కువగా ఉంటాయి. బంగాళదుంప రసం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బంగాళదుంప రసం ప్రయోజనాలను, దానిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 

బంగాళదుంప రసం ఎలా తయారుచేసుకోవాలంటే..

బంగాళాదుంప రసం కోసం కావలసిన పదార్థాలు: బంగాళాదుంప, చక్కెర లేదా ఉప్పు, ఆపిల్ లేదా నారింజ రసం

బంగాళాదుంప జ్యూస్ ఎలా తయారు చేయాలి:  ముందుగా బంగాళదుంపలను నీట్ గా కడగాలి. ఆ తర్వాత  బంగాళాదుంపలను జ్యూసర్ లో వేసి పట్టుకోవాలి. ఆ తర్వాత దీని నుంచి రసాన్ని వేరుచేసిపెట్టుకోవాలి. దీనిని అలాగే తాగినా మంచి ఫలితం ఉంటుంది. ఇలా తాగడం ఇష్టంలేని వాళ్లు దానికి ఏదైనా పండ్ల రసాన్ని కలపవచ్చు. ఆరెంజ్ లేదా మొసాంబి జ్యూస్ ను బంగాళాదుంప రసంలో మిక్స్ చేయొచ్చు. ఈ బంగాళాదుంప రసానికి చక్కెర లేదా ఉప్పును కలిపి తాగినా టేస్టీగా ఉంటుంది. 

బంగాళదుంప రసం వల్ల కలిగే ప్రయోజనాలు

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది

బంగాళదుంప రసం మధుమేహులకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ముఖ్యంగా దీనిలో కేలరీలు మొత్తానికే ఉండదు. కొవ్వు పెరుగుతుందన్న భయం అసలే ఉండదు. 

చర్మానికి ఎంతో మేలు చేస్తుంది

 బంగాళదుంప జ్యూస్ ను క్రమం తప్పకుండా తాగడం వల్ల చర్మ సమస్యలు తొలగిపోతాయి. ఇది మీ చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తుంది. అలాగే పోషణను అందిస్తుంది. దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల ముడతలు, మొటిమలు, డార్క్ సర్కిల్స్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ రసాన్ని తాగడంతో పాటుగా ముఖకానికి కూడా అప్లై చేసుకోవచ్చు. 
 


జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది

బంగాళదుంప రసం తాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం, అజీర్ణి సమస్యలతో బాధపడేవారికి ఇది మెడిసిన్ లా పనిచేస్తుంది. ఈ రసం కడుపులో మంటను తగ్గించి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. సాధారణంగా చాలా మంది బంగాళాదుంపలు ఉబ్బరాన్ని పెంచుతాయని నమ్ముతారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బంగాళదుంప రసం ఉబ్బరానికి మంచిదని చెబుతున్నారు.

click me!