Garlic: వెల్లుల్లిని ఇలాంటి వారు తినకూడదు..

First Published Jun 23, 2022, 11:48 AM IST

Garlic: వెల్లుల్లి చాలా శక్తివంతమైనది. ఇది ఎన్నో రోగాలను నయం చేస్తుంది. కానీ వీటిని కొందరు వ్యక్తులు అస్సలు తినకూడదు. 

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు.. ఉల్లి మాత్రమే కాదు.. వెల్లుల్లి వల్ల కూడా అనేక ఉపయోగాలున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. వెల్లుల్లి వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యం పెంపొందిచుకోవడానికి వెల్లుల్లి చక్కని పరిష్కారం. అందుకే కాబోలు ప్రతి వంటకంలో మన పెద్దలు వెల్లుల్లిని కచ్చితంగా ఉపయోగించేవారు. 
 

వెల్లుల్లిలో ఎన్నో ఔషద గుణాలుంటాయి. ఇది చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్ గుణాలు కూడా ఉంటాయి. ఇది ఎన్నో వ్యాధులను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అనేక పరిశోధనలు పేర్కొన్నాయి. అదే సమయంలో ఇంటి నివారణల నుంచి ఆయుర్వేద చికిత్స వరకు ప్రతి దానిలో ఇది ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

ఛాతీకి సంబంధించిన కొన్ని రకాల వ్యాధులను వెల్లుల్లి సమర్ధవంతంగా నివారిస్తుంది. శ్వాసకోశాలకు పట్టిన కొవ్వును కరిగించి శ్వాస సక్రమంగా జరిగేట్లు చేస్తుంది. ఊపిరితిత్తుల క్షయ వ్యాధికి వెల్లుల్లి సరిఅయిన ఔషధం. న్యూమోనియాకు వెల్లుల్లి అద్భుతమైన ఔషధమని వైద్యులు చెబుతున్నారు. అలాగే వెల్లుల్లిలోని 3 పాయలను పాలలో కలిపి మరగబెట్టి రాతవేళల్లో సేవిస్తే ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది. 

జీర్ణకోశ వ్యాధులకు వెల్లుల్లి చక్కటి ఔషదంగా ఉపయోగపడుతుంది. ఇది లింఫ్‌ గ్రంధుల మీద ప్రభావాన్ని చూపి శరీరంలో ఉన్న మలిన పదార్థాలను బయటికి పంపటంలో సహకరిస్తుంది. వెల్లుల్లి అరుగుదలకు ఉపయోగపడే రసాలను ప్రేరేపిస్తుంది.
 

బీపిని తగ్గించటానికి సమర్థవంతమైన మందుగా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. చిన్న ధమనులు మీద పడే ఒత్తిడిని, టెన్షన్‌నూ వెల్లుల్లి తగ్గిస్తుంది. నాడి చలనాన్ని నిదానపరిచి గుండె వేగాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఊపిరి అందకపోవటం, కళ్ళు తిరగటం, కడుపులో వాయువు ఏర్పడటం లాంటివాటిని అరికడుతుంది. 
 

ఇన్ని గొప్ప ప్రయోజనాలున్న వెల్లుల్లిని కొంతమంది అస్సలు తినకూడదు. ఏ వ్యక్తులు వెల్లుల్లిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


డయాబెటిస్ (Diabetes): 

మధుమేహ వ్యాధిగ్రస్తులు వెల్లుల్లి (Garlic)ని అధిక పరిమాణంలో తీసుకోవడం హానికరం. ఇది వారికి ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే దీనిని ఎక్కువగా తినడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇది వారికి ఇబ్బందిని కలిగిస్తుంది. దీనిని తక్కువ మొత్తంలో తీసుకుంటేనే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అందుకే మధుమేహులు వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోకూడదు. 
 

కాలేయ వ్యాధి (Liver disease): 

కాలేయం, ప్రేగులు లేదా పొట్టకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు వెల్లుల్లిని అస్సలు తినకూడదు. వీరు వెల్లుల్లిని తింటే ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. వీటిని ఎంత తక్కువ తింటే అంత మంచిది. 
 

ఇటీవలి శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు :

ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న వారందరూ వెల్లుల్లి తినడం మానుకోవాలి. వెల్లుల్లి రక్తాన్ని పలుచగా చేస్తుంది. అయితే ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నవారు దానిని తినకుండా ఉండాలి. ఎందుకంటే వారి గాయం అప్పుడే మానదు. వెల్లుల్లిని తినడం వల్ల రక్తం పలుచ బడటంతో అది గాయం నుంచి ప్రవహించే ప్రమాదం ఉంది. 

click me!