మహిళల కోసం బెస్ట్ పోస్టాఫీస్ స్కిం.. రెండేళ్లలో మీ డబ్బు పెంపు ?

By Ashok kumar SandraFirst Published May 4, 2024, 12:25 PM IST
Highlights

మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు, కనీస పెట్టుబడి, ప్రభుత్వం హామీ ఇచ్చే ఈ చిన్న పొదుపు పథకం గురించి మహిళలు తప్పకుండ తెలుసుకోవాలి... 
 

మహిళా సమ్మాన్ సేవింగ్స్  స్కీమ్ ఏప్రిల్ 2023లో ప్రారంభించారు, దీనిని మహిళల ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం హామీ ఇచ్చిన చిన్న పొదుపు పథకం. మహిళా సమ్మాన్ బచత్ పాత్ర అని కూడా పిలువబడే మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కిం  పోస్ట్ ఆఫీస్‌లు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇంకా సెలెక్ట్ చేసిన ప్రైవేట్ బ్యాంకులలో  లభిస్తుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కిం పరిమిత కాల చిన్న పొదుపు పథకం మార్చి 31 2025 వరకు ఉంటుంది. పోస్టాఫీసు మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ అర్హత గల కస్టమర్లకు ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ indiapost.gov.in రూ. 2,00,000 వరకు మల్టి  అకౌంట్స్  తెరవడానికి  సహాయపడుతుంది.

మహిళలు వారి కోసం లేదా మైనర్ బాలికల తరపున ఈ సర్టిఫికేట్ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ మార్చి 31 2024తో ముగిసే త్రైమాసికానికి 7.5 శాతం కాంపౌండ్ త్రైమాసికాన్ని అందిస్తుంది. దీని ఆధారంగా ఈ పథకంలో రూ. 10,000 డిపాజిట్ రెండేళ్లలో రూ.11,602కి పెరుగుతుంది. మహిళా సమ్మాన్ బచత్ యోజన (మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్) అకౌంట్ తెరిచిన తేదీ నుండి రెండు సంవత్సరాలలోపు మెచ్యూర్ అవుతుంది. అర్హత గల వారు దరఖాస్తు ఫారమ్‌తో పాటు KYC డాకుమెంట్స్ (ఆధార్ అండ్  పాన్), పేమెంట్ స్లిప్, పోస్టాఫీసులో క్యాష్  లేదా చెక్‌ ద్వారా పెట్టుబడి పెట్టడానికి డబ్బును అందించడం ద్వారా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అకౌంట్ సెటప్ చేయవచ్చు.

మెచ్యూరిటీ తర్వాత మొత్తం  (ప్రిన్సిపాల్ మరియు వడ్డీ) డిపాజిటర్ ఖాతాలో జమ చేయబడుతుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం ఖాతాని సెటప్ చేయడానికి కనీసం పెట్టుబడి రూ.1,000. ఖాతాల్లో ఒక్కో కస్టమర్‌కు గరిష్ట పరిమితి రూ.2 లక్షలు. ఒక ఖాతాకు ఒక డిపాజిట్ మాత్రమే అనుమతించబడుతుంది, కనీసం రూ. 100 కంటే ఎక్కువ ఉండాలి. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం కనీసం మూడు నెలల విరామంతో ఒకే డిపాజిటర్ ద్వారా మల్టి  అకౌంట్స్ అనుమతిస్తుంది. ప్రారంభించిన తేదీ నుండి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత, బకాయిల్లో 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఖాతాను 6 నెలలు పూర్తయిన తర్వాత కూడా ముందుగానే క్లోజ్ చేయవచ్చు.

click me!