సలాడ్ ను తినే అలవాటు లేదా? ఈ విషయం తెలిస్తే.. దీన్ని అస్సలు వదిలిపెట్టరు తెలుసా

First Published Jan 3, 2023, 3:07 PM IST

ఒక్కరోజు కూడా మిస్ కాకుండా సలాడ్ ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాము. ఇది బరువును తగ్గించడం నుంచి స్కిన్ టోన్ ను మెరుగుపర్చడం వరకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. 
 

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలనే తీసుకుంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహార జాబితాలో సలాడ్లు కూడా ఉంటాయి. సలాడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఒక గిన్నె సలాడ్ తింటే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఫైబర్ 

సలాడ్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ అని పిలువబడే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. ఒక గిన్నె సలాడ్ లో మన శరీరానికి కావాల్సిన ఫైబర్ కంటెంట్ ఉంటుంది.

Salad

సలాడ్ అనేది అనేక పోషకాల కలయిక

వివిధ పండ్లు,  కూరగాయల సలాడ్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పోషకాల లోపాన్ని పోగొడుతాయి. మీరు ఏ అవసరాలను తీర్చాలనుకుంటున్నారో మీ సలాడ్ లో ఏ కూరగాయలను పెంచాలో కూడా మీరే ఎంచుకోండి. 

Salad

బరువు తగ్గుతుంది

బరువును తగ్గడం అంత సులువు కాదు. దీనికోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటూ.. ఫైబర్ రిచ్ ఫుడ్స్ ను తింటే సులువుగా బరువు తగ్గుతారు. ముఖ్యంగా రోజూ ఇక బౌల్ సలాడ్ ను తింటే కూడా ఇంకా ఫాస్ట్ గా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

కొవ్వును తగ్గిస్తుంది 

మీ శరీరంలో మంచి కొవ్వులను పెంచడానికి నువ్వులు, అవిసె గింజలు, చియా గింజలను సలాడ్ కు జోడించండి. వీటిని కాల్చి లేదా ముడి విత్తనాలను తీసుకోవచ్చు. ఇవి మీ శరీరంలో మంచి కొవ్వులను బాగా పెంచుతాయి. అవొకాడో కూడా మీ శరీరరంలో కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. 
 

ఎముకల బలాన్ని పెంచుతుంది

మన శరీరంలో విటమిన్ కె లోపం వల్ల ఎముకలు ఖనిజ సాంద్రత, పెరుగుదలను తగ్గుతుంది. మీ ఎముకలు తిరిగి బలంగా మారేందుకు మీ సలాడ్ లో బచ్చలికూరను జోడించండి.
 

కంటి చూపును మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది

రోమైన్, బచ్చలికూర వంటి ఆకు కూరలలో కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. అలాగే తీవ్రమైన నష్టాన్ని కలిగించే ఫ్రీ రాడికల్స్  నుంచి కళ్లను రక్షిస్తాయి. 
 

కండరాల పనితీరు మెరుగుపడుతుంది

బచ్చలికూర వంటి ఆకుకూరలలో లభించే పోషకాలు మైటోకాండ్రియాను పెంచుతాయి. దీంతో కండరాల పనితీరు మెరుగుపడుతుంది. ఇది శక్తిని ఉత్పత్తి చేయడానికి, మన కండరాలకు శక్తినివ్వడానికి సహాయపడుతుంది.

గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి

ప్రతిరోజూ ఆరోగ్యకరమైన సలాడ్  ను తీసుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఎందుకంటే వీటిలో ఫైబర్, ఫోలేట్ స్థాయిలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన హృదయాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది స్ట్రోక్, గుండెపోటు వంటి గుండె జబ్బులను తగ్గిస్తుంది.
 

click me!