అయితే నిన్న రోజ్ డే పూర్తవ్వగా ఈరోజు ప్రపోజ్ డే. ఇక ఎవరైనా ఇంతకాలం తమ మనసులో ఉన్న మాటలను తాము ప్రేమించే వాళ్లకు చెప్పడానికి భయపడితే ఈరోజు ప్రపోజ్ చేసి చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రేమని వ్యక్తపరచడానికి కాస్త ధైర్యం అనేది వస్తుంది. అయితే ఎలా ప్రపోజ్ చేయాలో చాలామందికి తెలియదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ల కోసం ఎలా ప్రపోజ్ చేయాలో అనే ఐడియాస్ ఇప్పుడు తెలుపుతున్నాం.