Independence Day 2023
ప్రతి ఏడాది భారతదేశం ఆగస్టు 15 న స్వాతంత్య్ర దినోత్సవం వేడుకులను ఘనంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం మనం 77 వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. బ్రిటీష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజును మనం స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకుంటాం. వలస బ్రిటీష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్య్రం కోసం పోరాడిన గొప్ప భారతీయ స్వాతంత్య్ర సమరయోధుల శౌర్యం, స్ఫూర్తిని గుర్తుచేస్తూ స్వాతంత్య్రదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఏ ఏడాది 77 వ స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని ‘అజాదీ కా అజాదీకా అమృత్ మహోత్సవ్’ కింద ‘నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్’ అనే నినాదంతో వేడుకలను నిర్వహించనున్నారు. ఈ పండుగ సందర్భంగా మీ స్నేహితులు, సన్నిహితులతో పంచుకోవడానికి కొన్ని కోట్స్, సూక్తులు మీకోసం..
దశాబ్దాల పోరాటాలు, కోలుకోలేని నష్టాల తర్వాత మనకు లభించిన స్వాతంత్య్రాన్ని ఆస్వాధించాల్సిన రోజు ఇది. హ్యాపీ ఇండిపెండెన్స్ డే .
కొన్ని వస్తువులను ఎంత పెట్టినా కొనలేము. ఇలాంటి వాటిలో స్వేచ్ఛ ఒకటి. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఈ దేశం గర్వపడేలా ప్రతిజ్ఞ చేద్దాం..
స్వాతంత్య్ర దినోత్సవం అనేది మన స్వాతంత్య్ర వేడుక మాత్రమే కాదు. ఇది భిన్నత్వంలో ఏకత్వం, బలాన్ని కూడా జరుపుకుంటుంది. జై హింద్.. జై భారత్
మన దేశంపై మనకున్న ప్రేమకు హద్దులు లేవు. దాన్నిఎంతో సంబురంగా జరుపుకుందాం. ఈ రోజు మనం చెప్పుకుంటున్న పోరాటాల గురించి మన తర్వాతి తరానికి నేర్పిద్దాం.. హ్యాపీ ఇండిపెండెన్స్ డే
ఏ దేశమూ పరిపూర్ణమైనదీ కాదు. దానిని పూరిపూర్ణంగా మార్చాల్సిన అవసరం ఉంది. హ్యాపీ ఇండిపెండెన్స్ డే
మన దేశం బలంగా ఉండాలని వేలాది మంది తమ ప్రాణాలనే అర్పించారు. ఇలాంటి వారి త్యాగాలను ఎన్నటికీ మర్చిపోకండి. 77వ స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు.
అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశాన్ని రోజురోజుకు మరింత మెరుగైన దేశంగా తీర్చిదిద్దేందుకు పోరాడుదాం..
మనది వివిధ మతాలు, భాషలు, ఆచారాలు, సంస్కృతులు కలిగిన గొప్ప దేశం. ఒక పెద్ద దేశంగా అన్ని అడ్డంకులను ఎదుర్కొని అందరం ఏకతాటిపైకి వచ్చి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుందాం.
ఈ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా రేపటి కొత్త కలలను సాకారం కావాలని కోరకుందాం.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులందరికీ పెద్ద సెల్యూట్.. జై హింద్
‘మీ దేశం మీ కోసం ఏం చేయగలదని అడగకండి. మీ దేశం కోసం మీరేం చేయగలరని అడగండి’- జవహర్ లాల్ నెహ్రు
‘మీ రక్తం ఉప్పొంగకపోతే.. మీ సిరలలో ప్రవహించేది నీరు. మాతృభూమికి సేవ చేయకపోతే యువతకు ఒరిగేదేమిటి’- చంద్రశేఖర్ ఆజాద్