Healthy Hair: జుట్టును స్ట్రాంగ్ గా ఉంచే సూపర్ ఫుడ్స్.. వీటిని తింటే మీ జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది..

First Published Aug 10, 2022, 5:01 PM IST

Healthy Hair: కొన్ని రకాల మెడిసిన్స్ వాడకం, వంశపారంపర్యంగా, హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, పేలవమైన ఆహారం వల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంది. కొందరికైతే ఏకంగా బట్టతలే వస్తుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగుతుంది. 
 

జుట్టు రాలడం, చుండ్రు వంటివి ప్రస్తుత కాలంలో సర్వసాధారణ సమస్యలుగా మారిపోయాయి. వీటితో పాటుగా శపారంపర్యత, హార్మోన్లలో మార్పులు, ఒత్తిడి, కొన్ని రకాల మందుల వాడకం, పేలవమైన ఆహారాల వల్ల జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. అలాగే గర్భధారణ, ప్రసవం, జనన నియంత్రణ మాత్రలు, రుతువిరతి కారణంగా చాలా మంది ఆడవారు హెయిర్ ఫాల్ సమస్యలను ఫేస్ చేస్తున్నారు. 
 

అయితే జుట్టు రాలడాన్ని ఆపడానికి పోషకాహారం ఎంతో సహాయపడుతుంది. పోషకాహారాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. జుట్టు ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

ప్రోటీన్స్ (proteins)

మీరు తినే ఆహారంలో ప్రోటీన్స్ ఎక్కువ మొత్తంలో ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే ప్రోటీన్ జుట్టు బలంగా, ఒత్తుగా పెరిగేందుకు ఎంతో సహాయపడుతుంది. ప్రోటీన్ ఎక్కువగా లభించే ఆహారాల్లో గుడ్లు ఒకటి.
 

ఐరన్ (Iron)

జుట్టు పెరుగుదలకు ఇనుము ఒక ముఖ్యమైన ఖనిజం. శరీరంలో ఐరన్ కంటెంట్ తగ్గితే.. జుట్టు మూలాలకు ఆక్సిజన్, పోషకాలు తగినంతగా చేరవు. దీంతో జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. అలాగే వెంట్రుకలు పగిలిపోతాయి. 

సిట్రస్  పండ్లు (Citrus fruits)

సిట్రస్ పండ్లను తినడం వల్ల ఆరోగ్యంగా బేషుగ్గా ఉండటంతో పాటుగా మీ జుట్టుకూడా హెల్తీగా ఉంటుంది. జుట్టు పెరుగుదలకు అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి కూడా అవసరం. ఇక సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. 

nuts

నట్స్ (Nuts)

నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటివల్ల జుట్టుకు సరైన పోషణ అందుతుంది. వాల్ నట్స్, బాదం పప్పుల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అవిసె గింజలు కూడా జుట్టును బలంగా చేయడానికి సహాయపడతాయి.

తృణధాన్యాలు (Cereals)

తృణధాన్యాలలో  విటమిన్ బి, జింక్, ఐరన్లతో పాటుగా బయోటిన్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కణాల వ్యాప్తికి బయోటిన్ ఎంతో అవసరం. మీ జుట్టు పెరగడానికి అవసరమైన అమైనో ఆమ్లాలను ఉత్పత్తి చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

క్యారెట్ జ్యూస్ (Carrot juice)

మీ జుట్టు ఫాస్ట్ గా పెరిగేందుకు క్యారెట్ జ్యూస్ ఎంతో సహాయపడుతుంది. జుట్టు శరీరంలో వేగంగా ఎదుగుతున్న కణజాలాలను కలిగి ఉంటుంది. ప్రతి కణం ఎదుగుదలకు విటమిన్ ఎ ఎంతో అవసరం అవుతుంది. ఈ విటమిన్ క్యారెట్ లో పుష్కలంగా ఉంటుంది. ఇది మాడులో సహజ సెబమ్ నూనెను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టును వేగంగా పెంచేందుకు కూడా సహాయపడుతుంది. 
 

avocado

అవొకాడో (Avocado)

అవోకాడో లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు దీనిలో గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ ఇ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే దీనిలో ఉండే ఫోలికల్స్ జుట్టును పెంచడానికి సహాయపడతాయి. 

click me!