సాధారణంగా భార్యలు పుట్టింటికి వెళ్తున్నప్పుడు తమ భర్తలకు ఎన్నో విషయాలు చెప్తుంటారు. బయట తినకు, ఎక్కువ తిరగకు, ఇళ్లంతా చెత్తతో పాడు చెయ్యకు అంటూ ఎన్నో విషయాలను వారికి చెప్తూనే ఉంటారు. ఇందులో కొన్ని జాగ్రత్తలు ఉంటే, మరికొన్ని వార్నింగ్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా కామన్. వీటిని కూడా భర్తలు అంత సీరియస్ గా తీసుకోరు. ఇది ఇలాగే చెప్తుందిలే అని లైట్ తీసుకుంటారు. కానీ వాటిని చదివినప్పుడు మాత్రం తెగ నవ్వుస్తుంది. సాధారణంగా పెళ్లాం మొగుడి మధ్య ఫన్నీ ఛాట్స్ ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఓ ఛాట్ కూడా అందరికీ నవ్వు తెప్పిస్తుంది. పుట్టింటికి వెళ్తూ ఓ భార్య తన భర్తకు వాట్సాప్ ఎలాంటి మెసేజ్ పెట్టిందో తెలుసుకుందాం పదండి.