రోజా ఎత్తుకుని పెంచిన పాన్ ఇండియా స్టార్ హీరో ఎవరో తెలుసా..?

First Published | Nov 24, 2024, 8:14 PM IST

సినిమాలు మానేసి పాలిటిక్స్ లో బిజీగా ఉంది రోజా. ఈమధ్యే మళ్లీ సినిమాల్లోకి వస్తుంది అన్న టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఓ యంగ్ స్టార్ హీరోను ఎత్తుకుని పెంచాను అంటోంది రోజా. ఇంతకీ  ఆ పాన్ ఇండియా హీరో ఎవరో తెలుసా..? 

Actress Roja

రోజా సెల్వమణి.. హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన ఆమె.. పాలిటిక్స్ లోకి వచ్చిన తరువాత సినిమాలు మానేసింది. ఎమ్మెల్యేగా  ఉన్నప్పుడు జబర్ధస్త్ జడ్జిగా చేసిన ఆమె..మినిస్టర్ అయిన తరువాత బుల్లితెరను కూడా వదిలేశారు. ఇక ఇప్పుడు రోజా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. వైసీపీ ఓడిపోవడంతో రోజా కూడా మాజీ అయిపోయింది. 

Also Read: అల్లు అర్జున్ తీరని కోరిక ఏంటో తెలుసా..? బాలయ్యతో సీక్రెట్ పంచుకున్న బన్నీ.
 

ప్రస్తుతం చెన్నైలో రెస్ట్ తీసుకుంటున్న రోజా.. అప్పుడప్పుడు మాత్రమే రాజకీయాలపై స్పందిస్తున్నారు. అంతే కాదు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నారట  రోజా సెల్వమణి. అయితే ఈక్రమంలోనే ఆమె కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఓ ఫేమస్ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. 

Also Read: రెహమాన్‌ మంచివాడు.. తప్పుగా రాయకండి... విడాకుల పై సైరాబాను ఏమన్నారంటే..


Actress roja

తన రాజకీయ జీవితంతో పాటు సినిమా లైప్ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా వెలుగు వెలుగుతున్న స్టార్ హీరోను తాను చిన్నప్పుడు ఎత్తుకుని పెంచానని అన్నారు రోజా ఇంతకీ ఆ మీరో ఎవరో కాదు రామ్ చరణ్. అవును రామ్ చరణ్ ను చిన్నప్పుడు ఎత్తుకున్నానని.. అతని అల్లరి  చూశానని.. ఇప్పుడు రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా ఎదుగుతుంటే చాలా సంతోషం వేసిందన్నారు. 
 

Also Read: కొరియన్ సిరీస్‌లు చూడటం మానసిక ఆరోగ్యానికి మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారు..?

Roja-Chiranjeevi

రోజా బేసిక్ గా చిరంజీవి అభిమాని. రాజకీయ విభేదాలు ఉన్నా.. చిరును ఆమె విమర్శించినా.. మెగా ఫ్యామిలీ అంటే ఆమెకు చాలా అభిమానం. అందుకే మినిస్టర్ అవ్వగానే వెళ్లి చిరంజీవిని ఫ్యామిలీతో సహా వెళ్లి కలిశారు రోజా. ఇక తాజాగా రోజా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ప్రస్తావన వచ్చింది. 
 

Also Read: కృష్ణలో విజయనిర్మలకు నచ్చని విషయం ఏంటో తెలుసా..? సాయంత్రం అయితే అదే పనంట..

రామ్ చరణ్ గురించి రోజా మాట్లాడుతూ.. చిన్నప్పుడు రామ్ చరణ్ ని ఎత్తుకొని పెంచాను. ముఠామేస్త్రి షూటింగ్ సమయంలో ఊటీకి వచ్చాడు. అప్పుడు చాలా అల్లరి చేసేవాడు.  చాలా చిన్నప్పుడు బాగా హుషారుగా ఉండేవారు ఎక్కువ అల్లరి..పట్టుకోలేకపోయాం. స్కూల్ లో జాయిన్ అయ్యాక అల్లరి తగ్గింది. అటువంటిది రామ్ చరణ్  RRR చూశాక చాలా గర్వంగా అనిపించింది. 

ఓపెనింగ్ షాట్ లో చరణ్ దూకి అందర్నీ కొట్టి వస్తాడు అది అయితే భలే అనిపించింది. అతని డ్యాన్స్ లో వాళ్ళ నాన్న కనిపిస్తాడు. చిన్నప్పటి నుంచి చరణ్ వాళ్ళ నాన్న పాటలకు డ్యాన్స్ వేసేవాడు అంటూ రోజా రామ్ చరణ్ ను  పొగుడుతూ కామెంట్స్ చేయడంతో రోజా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. 
 

Latest Videos

click me!