ఇదిలా ఉంటే ఐశ్వర్య రాయ్ గతంలో అభిషేక్‌తో కలిసి నటించడానికి నో చెప్పిందట. మరి ఆ మూవీ ఏంటనేది చూస్తే, `హ్యాపీ న్యూ ఇయర్`. ఇది 2014 లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించారు, ఆయనతో పాటు అభిషేక్ బచ్చన్, సోనూ సూద్, బోమన్ ఇరానీ, వివాన్ షా, జాకీ ష్రాఫ్, దీపికా పదుకొనే కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఫరా ఖాన్ దర్శకత్వం వహించారు, ఆమె ఐశ్వర్యకు ఒక పాత్రను ఆఫర్ చేశారు. అయితే దీన్ని ఐశ్వర్య రిజెక్ట్ చేశారట. కారణం భర్తతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదట.