Lifestyle

చలికాలంలో రూమ్ హీటర్ లేకుండా గదిని వెచ్చగా ఉంచడం ఎలా?

మీరు రూమ్ హీటర్‌ని ఉపయోగిస్తున్నారా?

చలి నుండి రక్షించుకోవడానికి చాలా మంది రూమ్ హీటర్‌ ఉపయోగిస్తారు. కానీ దాని వేడి గాలి చర్మానికి హానికరం. అందువల్ల గదిని సహజంగా వేడిగా ఉంచండి. 

కిటికీలు, తలుపులు మూసి ఉంచండి

తలుపులు, కిటికీలను మూసివేయండి. మూల నుండి గాలి వస్తే, దానిని టేప్ లేదా వస్త్రంతో క్లోజ్ చేయండి. 

పగటిపూట తెరవండి

పగటిపూట ఎండ బాగా ఉన్నప్పుడు కిటికీలను తెరవండి. సన్ లైట్ గదిలోకి రావడం వల్ల గది ఉష్ణోగ్రత పెరుగుతుంది.

కర్టెన్లు ఉపయోగించండి

కిటికీలు, తలుపులపై మందమైన, ముదురు రంగు కర్టెన్లను ఉంచండి. ఇవి గదిలోని వేడిని బయటకు వెళ్లకుండా ఆపుతాయి. గదిని ఎక్కువసేపు వెచ్చగా ఉంచుతాయి.

కార్పెట్, దుప్పట్లు ఉపయోగించండి

నేలపై మీరు మందమైన, ప్యాడెడ్ కార్పెట్ లేదా రగ్గును వేయండి. మంచంపై షీట్ వేయడానికి ముందు మందమైన దుప్పటిని వేయండి. ఇవి చలిని తగ్గిస్తాయి. 

దీపాలు వెలిగించండి

సాయంత్రం రూం టెంపరేచర్ తగ్గడం ప్రారంభమైనప్పటి నుంచి మీ గదిలో కొవ్వొత్తులు లేదా దీపాలను వెలిగించండి. ఇవి కొంత వేడిని ఉత్పత్తి చేస్తాయి. అయితే పడుకునే ముందు వాటిని ఆర్పేయండి. 

వేడి నీటి బాటిల్ ఉపయోగించండి

రాత్రి పడుకునేటప్పుడు మీ దిండు దగ్గర వేడి నీటి బాటిల్ ఉంచండి. ఇది గదిలో ఎక్కువసేపు వెచ్చదనాన్ని నిలుపుతుంది.

అద్దం ఉపయోగించండి

మీరు పగటిపూట కిటికీలు, తలుపులను తెరిచినప్పుడు సన్ లైట్ ముందు అద్దం ఉంచండి. దీని వల్ల సూర్యుని వేడి అన్ని వైపులా వ్యాపిస్తుంది. చలి తగ్గుతుంది.

Find Next One