ఇలా చేయండి చాలు.. ఇట్టే నిద్రలోకి జారుకుంటారు

First Published Dec 13, 2023, 4:18 PM IST

మన ఆహారపు అలవాట్లే కాదు జీవన శైలి అలవాట్లు కూడా మెరుగ్గా ఉండాలి. అప్పుడే మనకు ఎలాంటి సమస్యలు రావు. ప్రతిరోజూ చిన్న చిన్న అలవాట్లను అనుసరిస్తే  మీరు రాత్రిళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్రపోవచ్చు. 

నిద్ర మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. అలసిసొలసిన శరీరానికి నిద్ర అవసరం కాదు అత్యవసరం. నిద్రతోనే మన శరీరం తిరిగి శక్తివంతంగా మారుతుంది. రేపటి కోసం  ఎనర్జిటిక్ గా తయారువుతుంది. కంటినిండా పడుకున్నప్పుడే మనం ఉదయం ఉల్లాసంగా, ఎనర్జిటిక్ గా ఉండగలుగుతాం. మంచి రాత్రి నిద్ర మన శరీరాన్ని రీఛార్జ్ చేయడానికి సహాయపడుతుంది.  అనీ ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. మరికొంతమంది నిద్రపోవాల్సిన టైం లో సినిమాలు చూస్తూ, సోషల్ మీడియాలో టైం పాస్ చేస్తూ ఉంటారు. ఏ  ఒంటిగంటలో రెండింటికో పడుకుంటూ ఉంటారు. ఇలా లేట్ గా పడుకోవడం వల్ల లేట్ గా నిద్రలేస్తారు. కానీ నిద్ర లేకపోవడం వల్ల మీకు చిరాకు, చిరాకు కలుగుతాయి. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యల బారిన కూడా పడే అవకాశముంది. 
 

నిద్రపోకపోవడానికి, లేట్ గా పడుకోవడానికి ఎవరి కారణాలు వాళ్లకు ఉండొచ్చు. కానీ మనం ఆరోగ్యంగా ఉండేందుకు నిద్ర చాలా చాలా అవసరం. అయితే రాత్రిపూట ప్రశాంతంగా పడుకోవడానికి మీరు ప్రతిరోజూ చిన్న చిన్న పనులను చేస్తే సరిపోతుంది. అలాగే మీ జీవన శైలిని కూడా మార్చుకోవాల్సి వస్తుంది. ఈ ఛేంజెస్ ను గనుక రోజూ ఫాలో అయితే మీరు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా నిత్రపోతారు.
 

sleep deprivation

ఈ సాధారణ అలవాట్లను మీ దినచర్యలో చేర్చడం వల్ల మీ సిర్కాడియన్ లయ సర్దుబాటు అవుతుంది. మెలటోనిన్, కార్టిసాల్ హార్మోన్ల ఉత్పత్తిని సమతుల్యం చేయొచ్చు. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మీరు ప్రశాంతంగా నిద్రలోకి జారుకోవడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పడు తెలుసుకుందాం పదండి.

ఉదయం సూర్యరశ్మిలో కాసేపు..

ఏది ఏమైనా ఉదయం కాసేపు ఎండకు ఉండండి. సూర్యరశ్మి ఒంటికి తగలడం వల్ల రిఫ్రెష్ అనుభూతి కలుగుతుంది. అలాగే నిద్ర, మేల్కొనే చక్రం సరిగ్గా పనిచేస్తుంది. దీంతో మీరు రాత్రిపూట తొందరగా నిద్రపోవచ్చు. 

Image: Getty

వ్యాయామం

నిద్రవేళకు ముందు ఎట్టి పరిస్థితిలో వ్యాయామం జోలికి వెళ్లకండి. ఎందుకంటే ఇది విశ్రాంతి తీసుకునే మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కానీ పగటిపూట బాగా వ్యాయామం చేసేలా ప్లాన్ చేసుకోండి. 
 

సమయానికి మేల్కొనడం

మనం ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రలేవడం అలవాటు చేసుకుంటే.. మీ శరీరం దానిని సర్దుబాటు చేసుకుంటుంది. అంటే రెగ్యులర్ గా లేచే టైం కే నిద్రలేస్తారు. అలాగే ఒకేసమయానికి పడుకోవడం అలవాటు చేసుకుంటే మీకు ఆ సమయానికే నిద్రపడుతుంది. 
 

night sleep

కాఫీ 

కాఫీ మనకు రీఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది. కాఫీని తాగితే నిద్రమత్తు వదులుతుంది. అందుకే సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత అస్సలు నిద్రపోకండి. ఎందుకంటే కాఫీలో కెఫిన్ కంటెంట్ ఉంటుంది. ఇది మీకు నిద్రపట్టకుండా చేస్తుంది. అందుకే నిద్రపోవడానికి ముందు కాఫీని ఎట్టిపరిస్థితిలో తాగకండి.
 

సమతుల్య ఆహారం

రాత్రిపూట సమతుల్య ఆహారాన్ని తినే అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇది మీ శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. అలాగే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరగడాన్ని నివారించడానికి సహాయపడుతుంది. కార్డిసాల్ మనకు ఒత్తిడిని కలిగిస్తుంది. అయితే పడుకునే ముందు ఎక్కువ ఆయిల్ లేదా స్పైసీ ఫుడ్స్ ను తినడం మానేయండి.

click me!