తమ కుటుంబంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు భయపడేది లేదని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు తమపై చేసిన వరుస ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజమని వారి దర్యాప్తులో నిరూపించలేక పోయారన్నారు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతూ జగన్‌కు అండగా నిలుస్తున్న నేతలను దెబ్బతీయాలనే లక్ష్యంతో రాజకీయంగా చేయిస్తున్న ఈ దాడులను సమర్థంగా ఎదుర్కొంటామన్నారు.