Birth Date: ఈ తేదీల్లో పుట్టినవాళ్లు మనసులో ఏదుంటే అది బయటకు మాట్లాడేస్తారు..!

న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీని బట్టి వ్యక్తుల ప్రవర్తన, సామర్థ్యం, వారి ఇష్టాలు ఇతర విషయాలు తెలుసుకోవచ్చు. కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టినవాళ్లు చాలా ఓపెన్ గా ఉంటారు. మనసులో ఏదుంటే అది మొహం మీద మాట్లాడేస్తూ ఉంటారు. మరి ఆ తేదీలెంటో ఇక్కడ చూద్దాం.

Numerology Birth Dates Impacting Moods Easily in telugu KVG

మంచి, చెడు అన్ని మనసులో పెట్టుకొని టైం వచ్చినప్పుడు అక్కసు వెళ్లబుచ్చే వాళ్లకన్నా.. ఎప్పుటికప్పుడు మనసులో ఏది అనిపిస్తే అది బయటకు మాట్లాడే వాళ్లు చాలా బెటర్. ఈ రోజుల్లో ఇలాంటి వారు చాలా తక్కువ. ఓపెన్ గా మాట్లాడేవారు చాలావరకు నిజాయతీగా ఉంటారు. అబాద్దాలు చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. ఇందుకు కారణం వారు పుట్టిన తేదీనే కావచ్చు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో జన్మించిన వారు ఏదుంటే అది మొహం మీద చెప్పేస్తారట. ఏ తేదీల్లో పుట్టిన వారు ఇలా ఉంటారో ఇక్కడ చూద్దాం.

ఏ తేదీల్లో పుట్టిన వారు ఓపెన్ గా ఉంటారు?

మనసులో ఏది ఉంటే అది పైకి మాట్లాడటం చాలా మంచి అలవాటు. అయినప్పటికీ అది ఒక్కోసారి ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టవచ్చు. దానివల్ల కొన్ని క్షణాల్లోనే వారి మూడ్‌ లేదా మంచి సిట్యుయేషన్‌ పాడై పోవచ్చు. అసలు ఏ తేదీల్లో పుట్టిన వాళ్లు ఇలా ఓపెన్ గా మాట్లాడుతారు? దానివల్ల కొన్నిసార్లు ఇతరుల మూడ్ ను వీరు ఈజీగా ఎలా పాడుచేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

Latest Videos

సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ ద్వారా వ్యక్తుల గుణాలు, వ్యక్తిత్వాలు తెలుసుకోవచ్చు. ఓపెన్ గా మాట్లాడే వారిలో మొదటి వరుసలో ఉంటారు 1, 4, 7, 9, 13, 18, 22, 27, 29, 31 తేదీల్లో పుట్టినవాళ్లు. ఉన్నది ఉన్నట్టు చెప్పడం మంచి అలవాటే అయినప్పటికీ ఈ తేదీల్లో పుట్టినవాళ్లు కొన్ని క్షణాల్లోనే ఇతరుల మూడ్‌ను పాడు చేస్తారు. కానీ మనసులో మాత్రం  చాలా స్వచ్ఛంగా ఉంటారు.

ఈ తేదీల్లో పుట్టిన వారు తమ టైమ్ ఎంత విలువైందో అని భావిస్తారో ఇతరుల టైమ్‌ను కూడా అంతే గౌరవిస్తారు. నిజం మాట్లాడటం, నిజం వినడానికి ఇష్టపడతారు. వెనకాల మాట్లాడేవాళ్లకి వీరు చాలా దూరంగా ఉంటారు. ఆలోచించకుండా ఏదో ఒకటి అనే అలవాటు ఇతరులకు బ్యాడ్‌గా అనిపిస్తుంది. ఎదుటివాళ్లు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా, తమకు నిజమనిపించేది క్లియర్‌గా చెప్పేస్తారు. అబద్ధం చెప్పడం, మోసం చేయడానికి వీరు అస్సలు ఇష్టపడరు.

గమనిక : జ్యోతిష్యం, న్యూమరాలజీ, ఇతర నమ్మకాల ఆధారంగా ఈ సమాచారం ఇవ్వబడింది. దీన్ని సమాచారంగా మాత్రమే చూడాలి.

vuukle one pixel image
click me!