ఇరుకైన రక్త నాళాలు రక్త ప్రవాహానికి మరింత నిరోధకతను కలిగిస్తాయి. మీ ధమనులు ఇరుకుగా మారితే మీ రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక రక్తపోటు దీర్ఘకాలికంగా ఉంటే ఒత్తిడి, గుండె జబ్బులతో సహా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒకప్పుడు రక్తపోటు పెద్దవయసు వారికి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు చిన్నవయసు వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తోంది. నిజానికి చాలా మందికి ఈ సమస్య ఉన్నా.. దాన్ని గుర్తించరు. కానీ అధిక రక్తపోటు మీ రక్త నాళాలను, అవయవాలకు, ముఖ్యంగా మెదడు, గుండె, కళ్ళు, మూత్రపిండాలకు హాని కలిగిస్తుంది.