3.ఉసిరికాయ జ్యూస్..
చక్కెర కలపకుండా తీసుకునే ఆమ్లా జ్యూస్ బరువు తగ్గడానికి చాలా మంచిది. ఈ జ్యూస్ తాగడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడంలో సహాయం చేస్తుంది.
4. పసుపు + మిరియాల నీరు
గోరువెచ్చని నీటిలో పసుపు, కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగడం చాలా ప్రయోజనకరం. ఇది తాగడం వల్ల శరీరంలో పేరుకున్న కొవ్వు కరుగుతుంది. శరీర వాపు తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
5. బ్రెజిల్ నట్
బ్రెజిల్ నట్‌లో సెలీనియం, ప్రోటీన్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరును మెరుగుపరచి, హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి. దీని వల్ల బరువు నియంత్రణ సులభమవుతుంది. రోజుకు ఒక్కటి లేదా రెండు సరిపోతాయి.
చివరిగా ఒక ముఖ్యమైన విషయం…
ఖాళీ కడుపుతో సరైన ఆహారం తీసుకుంటేనే బరువు తగ్గగలరు. అయితే, ఆహారం ఒక్కటే ఎలాంటి మ్యాజిక్ చేయదు. ఆరోగ్యకరమైన ఆహారం తినడం, సరైన నిద్ర, మంచి నీరు తాగడం చాలా ముఖ్యం. అయితే.. బరువు తగ్గడం అనేది ఒక్క రోజులో జరగదు. ఓపికగా ఉంటూ ఆరోగ్యకరమైన అలవాట్లు ఫాలో అయితేనే ఇది సాధ్యం అవుతుంది.