అవిసె గింజలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ… చలికాలంలో వీటిని తినొచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి చలికాలంలో అవిసె గింజలు తింటే ఏమవుతుంది? ఎవ్వరు వీటిని అస్సలు తినకూడదు? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
చలికాలంలో అవిసె గింజలు తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే సమస్యలు రావచ్చు. అవిసె గింజల్లో ప్రోటీన్, ఫైబర్, జింక్, మెగ్నీషియం, విటమిన్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం ద్వారా చలికాలంలో శరీరానికి అవసరమైన ఉష్ణోగ్రత లభిస్తుంది. అంతేకాదు శక్తి, రోగనిరోధక శక్తి పెరగడానికి కూడా అవిసె గింజలు సహాయపడతాయి.
25
అవిసె గింజల ఆరోగ్య ప్రయోజనాలు
చలికాలంలో అవిసె గింజలను తినడం వల్ల శరీరంలో శక్తి, హార్మోన్ల సమతుల్యత పెరుగుతుంది. రక్తస్రావం వంటి సమస్యలు తగ్గుతాయి. అవిసె గింజల్లోని మెగ్నీషియం, జింక్, విటమిన్లు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి.
35
గుండె ఆరోగ్యానికి
అవిసె గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్.. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అవిసె గింజలను మితంగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. చర్మం కూడా తేమగా మారుతుంది. ముడతలు తగ్గుతాయి. అంతేకాదు ఇవి ఆకలిని తగ్గించి, బరువు పెరగకుండా నియంత్రిస్తాయి.
నిపుణుల ప్రకారం అవిసె గింజలను రోజూ 1–2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవచ్చు. అవిసె గింజలను ఉదయం అల్పాహారంగా లేదా భోజనం తర్వాత లేదా సాయంత్రం స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు. వీటిని వేయించి లేదా పొడి చేసి ఉపయోగించవచ్చు.
55
ఎవరు తినకూడదు?
అవిసె గింజలను సరైన పరిమాణంలో, సరైన విధంగా తినడం వల్ల అవి శరీరానికి పవర్ బూస్టర్ గా మారతాయి. ఎక్కువగా తీసుకుంటే గ్యాస్, వాంతులు, బరువు పెరగడం లేదా హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా గర్భిణీలు, జీర్ణ సమస్యలు ఉన్నవారు, లేదా డయాబెటిస్ మందులు వాడుతున్నవారు అవిసె గింజలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.